Harudu: వెంకట్ రీ ఎంట్రీ.. ఫ‌స్ట్ లుక్ మాములుగా లేదుగా

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:48 PM

శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు.

harudu

శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ (Venkat) సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. మైత్రి ఆర్ట్స్ & మైత్రి బాక్సాఫీస్ బ్యానర్ లో వెంకట్ (Venkat) హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ 'హరుడు' (Harudu). శ్రీహరి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr ప్రవీణ్ రెడ్డి, Dr దిక్కల లక్ష్మణరావు నిర్మిస్తున్నారు.

GXcBhFWXwAAyr9W.jpeg

ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ఇది కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ. వెంకట్ గారి ఇది మంచి కం బ్యాక్ మూవీ అవుతుంది' అన్నారు.

GXhk_v6aYAAxijL.jpeg

ఈ చిత్రంలో హెబ్బపటేల్ (Hebba Patel) , సలోని (Saloni), నటాషా (Natasha) , అలీ (Ali ), సుమన్, రవి వర్మ , సుభశ్రీ కీలక పాత్రలు పోషిస్తుండ‌గా, ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మని జీన్న సంగీతం అందిస్తుండగా, సన్నీ D, ఆనంద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతీ ఎడిటర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 03:48 PM