Sreeleela- Thaman: తిరుమ‌ల శ్రీవారి చెంత శ్రీలీల‌.. బుగ్గ గిల్లిన తమన్‌ (వీడియో వైర‌ల్‌)

ABN , Publish Date - Jun 25 , 2024 | 07:22 PM

తిరుమ‌లకు టాలీవుడ్ ప్ర‌ముఖులు క్యూ క‌ట్టారు. ఈరోజు (మంగ‌ళ‌వారం) స్టార్ హీరోయిన్ శ్రీలీలతో పాటు, త‌మ‌న్ గాయ‌ని సుశీల‌, సింగ‌ర్ కార్తీక్ స్వామి వారిని ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Sreeleela- Thaman: తిరుమ‌ల శ్రీవారి చెంత శ్రీలీల‌.. బుగ్గ గిల్లిన తమన్‌ (వీడియో వైర‌ల్‌)
sree leela

తిరుమ‌ల (Tirumala)కు టాలీవుడ్ ప్ర‌ముఖులు క్యూ క‌ట్టారు. ఈరోజు (మంగ‌ళ‌వారం) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)తో పాటు, సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ (Thaman), గాయ‌ని సుశీల‌, సింగ‌ర్ కార్తీక్ (Karthik) శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఒక్క రోజే న‌లుగురు సినీ ప్ర‌ముఖులు తిరుమ‌ల (Tirumala) కు రావ‌డంతో అక్క‌డ చాలా సంద‌డి వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. సెల్ఫీల కోసం అభిమానులు ఎగ‌బ‌డ్డారు.


అయితే శ్రీలీల (Sreeleela) స్వామి వారిని ద‌ర్శించుకుని బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మయంలో త‌మ‌న్ (Thaman), కార్తీక్ (Karthik) ఎదురు ప‌డడంతో వారు అక్క‌డ‌ కొన్ని క్ష‌ణాలు మాట్లాడుకున్నారు. ఈ క్ర‌మంలో త‌మ‌న్ శ్రీలీల బుగ్గ‌పై ట‌చ్ చేసి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అనంత‌రం ఎవ‌రి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజ‌న్లు వివిధ ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 07:22 PM