Sree Leela: విదేశాల్లో శ్రీలీల వీర‌విహారం.. వ‌య్యారాలు బోతున్న న‌య‌గారం

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:35 AM

తెలుగు అగ్ర న‌టి శ్రీలీల బ‌య‌ట దేశాల్లో వీర‌విహారం చేస్తోంది. అక్క‌డ ఫొటోషూట్ల‌లో పాల్గొంటూ, బీచ్‌ల‌లో తిరుగుతూ వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోల‌ను సోష‌ల్‌మీడియాలో షేర్ చేస్తూ కుర్ర‌కారును క‌వ్విస్తోంది.

Sree Leela: విదేశాల్లో శ్రీలీల వీర‌విహారం.. వ‌య్యారాలు బోతున్న న‌య‌గారం

స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sree Leela) హ‌డావిడి తెలుగునాట ఈ యేడు కాస్త నెమ్మ‌దించింది. గ‌త సంవ‌త్స‌రం స్కంద‌, భ‌గ‌వంత్ కేస‌రి, ఎక్స్ట్రార్డిన‌రీ మ్యాన్‌, ఆదికేశవ వంటి సినిమాల‌తో ఆ యేడంతా ఇంట‌ర్వ్యూలు, ప్ర‌మోష‌న్ల‌తో హంగామా చేస్తూ క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ యేడు మొద‌ట్లో గుంటూరుకారం సినిమాలో మాత్ర‌మే కనిపించి అల‌రించింది. అ త‌ర్వాత బ్రేక్ తీసుకున్న ఈ చిన్న‌ది ఇప్పుడు విదేశాల‌లో బిజీగా గ‌డుపుతోంది. ఎక్కువ‌గా ఫొటోషూట్ల‌లో పాల్గొంటు కవ్విస్తోంది.

4.jpg

ప్ర‌స్తుతం అమెరికాలో డాక్ట‌ర్ పీజీ కోర్సు చేస్తున్న శ్రీలీల (Sree Leela) ఓ వైపు త‌న చ‌దువును కొన‌సాగిస్తూనే స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా అక్క‌డే విహార‌యాత్ర‌లతో ఎంజాయ్ చేస్తోంది.

8.jpg

ఆ ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ త‌న అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు కెన‌డాలో స‌ముద్ర తీరానా తిరుగుతూ నేచర్‌ను ఆస్వాదిస్తోంది. చీర‌లో వ‌య్య‌రాలు బోతూ న‌మ‌గారా లాంటి సోయ‌గాల‌తో హీట్ పెంచుతోంది.

6.jpg


ఇప్పుడు ఆ ఫోటోలు సామాజిక మాద్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజ‌న్లు రొమాంటిక్‌గా స్పందిస్తున్నారు.

7.jpg

అమ్మ‌డు అక్క‌డ ఉన్నా, ఇక్క‌డ ఉన్నా మా గుండెల్లో వీర వీహారం చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

1.jpg

ఇదిలాఉండ‌గా ప్ర‌స్తుతం శ్రీలీల (Sree Leela) ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, ర‌వితేజతో ఓ సినిమాలో న‌టిస్తోంది.

10.jpg

Updated Date - Jun 07 , 2024 | 10:47 AM