14 Years Of Samantha: నిన్నకాక మొన్న వచ్చి ఏమాయ చేశావె.. పిల్లి మొగ్గలేసిందిలా..

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:09 AM

"ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుండెకి ఏమవ్వలా.. నిన్నకాక మొన్న వచ్చి ఏమాయ చేశావె పిల్లిమొగ్గలేసిందిలా’’ సగటు తెలుగు ప్రేక్షకుడు సమంత గురించి పాడుకుంటున్న పాట ఇది.

14 Years Of Samantha: నిన్నకాక మొన్న వచ్చి ఏమాయ చేశావె.. పిల్లి మొగ్గలేసిందిలా..


"ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుండెకి ఏమవ్వలా..
నిన్నకాక మొన్న వచ్చి ఏమాయ చేశావె పిల్లిమొగ్గలేసిందిలా’’

సగటు తెలుగు ప్రేక్షకుడు సమంత (Samantha) గురించి పాడుకుంటున్న పాట ఇది. ఆమెను అభిమానించే ప్రతి ఒక్కరూ కథానాయికగా సామ్‌ పధ్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పాటతో శుభాకాంక్షలు చెబుతున్నారు. 'ఏమాయ చేశావె’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ తన అందం, నటనతో కుర్రకారుడి నిజంగానే మాయ చేసేసింది. ప్రతి అభిమాని గుండెల్లోనూ అందాల నటిగా తిష్ట వేసుకుని కూర్చుంది. అతి తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొని హిట్స్‌ కొట్టి స్టార్‌గా ఎదిగింది. ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం 'ఏమాయచేశావె’(Ye mayachesave). నాగచైతన్య హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్  దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26, 2010లో విడుదలైంది. నేటికి సరిగ్గా 14 ఏళ్లు పూర్తయింది(14 years of Samantha). దాంతో సామ్‌ చిత్ర పరిశ్రమలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరియర్‌లో సమంత కమర్షియల్‌ హీరోయిన్‌గా ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోలు అందరితో యాక్ట్‌ చేసినట్లే. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో సామ్‌ మెప్పించింది. 'ఏ మాయ చేసావె’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకి మొదటి సినిమాతోనే సూపర్‌ సక్సెస్‌ వరించింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్‌లో సమంత టాప్‌లో ఉందని చెప్పొచ్చు.

Sam-15.jpg



ఇక సమంత 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. సినీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అగ్ర కథానాయిక, లేడీ సూపర్‌స్టార్‌ నయనతార సామ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో  ఓ పోస్ట్‌ చేసి, 'సమంత నటిగా మీకు మరింత పవర్‌ రావాలి’’ అని పేర్కొన్నారు. సమంత కూడా నయన్ కు  థ్యాంక్స్‌ చెప్పారు. 

Nayana.jpg

ఇక అభిమానులు అయితే సమంత నటించిన చిత్రాల్లోని ఫొటోలతో ఓ ఫ్రేమ్‌ చేసి 'తలైవి సమంతకు శుభాకాంక్షలు. ఇంకా ఎన్నో ఏళ్లు హీరోయిన్ గా అలరించాలని  కోరుకుంటున్నాం’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. వీటిని గమనించిన సామ్‌..

'ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుండెకి ఏమవ్వలా.. 

నిన్నకాక మొన్న వచ్చి ఏమాయ చేశావె పిల్లిమొగ్గలేసిందిలా’’

అనే పాటను ప్లే చేస్తూ, అప్పుడే పధ్నాలుగేళ్లా... ఓ కలలా లేదు అంటూ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ  ఓ క్యూట్‌ వీడియో  ఇంస్టాగ్రామ్  స్టేటస్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Sam-fan.jpg

Updated Date - Feb 26 , 2024 | 11:27 AM