Priyanka Mohan: ప్రియాంకా మోహ‌న్.. గేర్ మార్చిన‌ట్టేనా?

ABN , Publish Date - Mar 24 , 2024 | 06:03 PM

ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాప‌నింగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహ‌న్. తాజాగా కాస్త మ‌సాలా పంచేలా డ్రెస్సింగ్‌తో గ్లామ‌ర్‌ను జోడిస్తూ దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Priyanka Mohan: ప్రియాంకా మోహ‌న్.. గేర్ మార్చిన‌ట్టేనా?
PRIYANKA MOHAN

ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాప‌నింగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహ‌న్ (Priyanka Mohan). అందం, అభిన‌యం పుష్క‌లంగా ఉన్న ఈ న‌టి ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి అర పుష్క‌రం అవుతున్నా రావాల్సినంత క్రేజ్‌ను మాత్రం సాధించలేద‌నేది మాత్రం వాస్త‌వం. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ మాత్రం నిదానంగానే ఉంది.

Priyanka-Mohan-2.jpg

ఈ మ‌ధ్యే ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్ సినిమాతో అల‌రించిన ప్రియాంక (Priyanka Mohan) తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓజీ, నాని స‌రిపోదా శ‌నివారం అనే సినిమాల‌కు సైన్ చేసింది.

Priyanka-Mohan-6.jpg

అయితే ఈ అమ్మ‌డు తొలినుంచి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉండ‌డం కేవ‌లం ఓమ్లీ క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే చేస్తూ రావ‌డంతో కెరీర్ స్పీడు అందుకోలేద‌ని చాలా మంది అభిప్రాయం.


Priyanka-Mohan-1.jpg

అయితే ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న‌ ప్రియాంక మోహ‌న్ (Priyanka Mohan) నిత్యం వివిధ ఫొటోషూట్ల‌లో పాల్గొంటూ ఆ ఫొటోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌తో పంచుకుంటూ గిలిగింత‌లు పెడుతూ వ‌స్తోంది.

Priyanka-Mohan-4.jpg

తాజాగా కాస్త మ‌సాలా పంచేలా డ్రెస్సింగ్‌తో గ్లామ‌ర్‌ను జోడిస్తూ దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Priyanka-Mohan-3.jpg

ఇదిలాఉంండ‌గా ఈ మ‌ధ్య అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ గ్లామ‌ర్ బాట ప‌ట్టిన‌ట్లే ప్రియాంక (Priyanka Mohan) కూడా పోటీని త‌ట్టుకోవ‌డానికి, అవ‌కాశాల కోసం అందాల ప్ర‌ద‌ర్శ‌ణ మొద‌లెట్టిందా, మొద‌లు పెడుతోందా ఏంటి అనుకుంటున్నారు.

Priyanka-Mohan-7.jpg

అలా చేస్తే ఇక చేతి నిండా చాన్స్‌లే అంటూ ఫ్యాన్స్‌, నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఆ ఫొటోల‌ను చూసేయండి మ‌రి.

Priyanka-Mohan-8.jpg

Updated Date - Mar 24 , 2024 | 06:03 PM