Nivetha Thomas: పెళ్లికి.. రెడీ అవుతోన్న నాని బ్యూటీ?

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:12 PM

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ తెలుగు క‌థానాయిక, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ నివేతా థామ‌స్ పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అమె చేసిన పోస్టు ఇప్పుడీ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది.

Nivetha Thomas: పెళ్లికి.. రెడీ అవుతోన్న నాని బ్యూటీ?
Nivetha Thomas

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో క‌థానాయిక పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ద‌మైంది. మూడు నాలుగు నెల‌ల క్రిత‌మే గుడ్నైట్ అనే త‌మిళ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీతా ర‌ఘునాథ్ (Meetha Raghunath) పెళ్లి చేసుకుని సెటిల‌వ‌గా ఇప్పుడు ఆ లిస్టులో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ నివేతా థామ‌స్ (Nivetha Thomas) చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అమె చేసిన పోస్టు ఇప్పుడీ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది.

Nivetha Thomas

2008లో బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చి త‌మిళ‌, మ‌ల‌యాళంలో డ‌జ‌న్‌కు పైగా చిత్రాల్లో న‌టించిన నివేతా ఆ త‌ర్వాత 2016లో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా వ‌చ్చిన జెంటిల్‌మెన్ సినిమాతో క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసింది. ఆ సినిమా విజ‌యంతో వ‌రుస‌గా నిన్నుకొరి,ల‌వ‌కుశ వంటి ఎనిమిది సినిమాల్లో హీరోయిన్‌గా చేసి తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉండేలా చూసుకుంది.


గ్లామ‌ర్‌కు ఆమ‌డ దూరంలో ఉంటూ కేవ‌లం న‌ట‌న‌కు స్కోప్ ఉన్న చిత్రాల‌నే సెల‌క్టివ్‌గా చేస్తు ఇక్క‌డి తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌రైంది.చివ‌ర‌గా 2022లొ శాకిని డాకిని అనే తెలుగు సినిమాలో న‌టించిన నివేథా ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో ఒక్క సినిమానే చేసి ప్ర‌స్తుతం ఇంటివ‌ద్దే కాల‌క్షేపం చేస్తోంది. చాలావ‌ర‌కు సినిమాలు త‌గ్గించుకున్న ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ ఎక్కువ‌గా కుటుంబంతోనే గ‌డుపుతోంది.

Nivetha Thomas

ఈ క్ర‌మంలోనే ఈ రోజు (సోమ‌వారం) త‌న ఎక్స్ అకౌంట్‌లో చాలా కాలమైంది బ‌ట్‌.. చివ‌రిగా కుదిరింది అంటూ ల‌వ్ ఎమోజీని జ‌త చేసింది. ఈ ట్వీట్ చూసిన చాలామంది నెటిజ‌న్లు, అభిమానులు నివేతా త‌న‌ పెళ్లి క‌బురు గురించే ఆ పోస్టు పెట్టింద‌ని అంటుండ‌గా మ‌రికొంద‌రు త‌న కొత్త సినిమా ప్ర‌క‌ట‌న గురించి అయి ఉంటుంద‌ని కామెంట్లు చేస్తున్నారు. చూడాలి ఇందులో ఏది వాస్త‌వ‌మో.

అంతా పుకార్లే..

ఇదిలాఉండ‌గా నివేతా థామ‌స్ త‌న సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు త‌న పెళ్లి గురించే అని ఉద‌యం నుంచి విప‌రీతంగా ప్ర‌చారం అవ‌గా తాజాగా ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ మ‌రో అప్డేట్ ఇచ్చింది. దాదాపు 3 సంవ‌త్స‌రాల త‌ర్వాత త‌ను న‌టించ‌బోతున్న సినిమా గురించి ఆ పోస్టులో ఉండ‌డం గ‌మ‌నార్హం.

రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్ప‌ణ‌లో ప్రియ‌ద‌ర్శి హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. తెలుగుతో పాటు త‌మిళ‌,మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా టైటిల్ మంగ‌ళ‌వారం రివీల్ చేనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఉద‌య్ నుంచి నివేతా పెళ్లి గురించి జ‌రిగిన చ‌ర్చ అంతా పుకార్లే అని తేలిపోయింది.

Updated Date - Jun 24 , 2024 | 09:58 PM