Hema - Rave Party: ఇప్పుడు రాలేను.. కొంత సమయం కావాలి!

ABN , Publish Date - May 27 , 2024 | 04:40 PM

బెంగళూరు ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ (Hema) కూడా ఉన్నారని, సోమవారం విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే!

Hema - Rave Party: ఇప్పుడు రాలేను.. కొంత సమయం కావాలి!

బెంగళూరు ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ (Hema) కూడా ఉన్నారని, సోమవారం విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే! అయితే ఆమెకు  వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, విచారణకు హాజరుకాలేనని బెంగళూరు పోలీసులకు (CCB) లేఖ రాసినట్లు తెలుస్తోంది. రేవ్‌ పార్టీ (Rave Party) కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతోపాటు సినీ నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో తాను జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరు కావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోనట్లు సమాచారం. విచారణకు గైర్హాజరైన హేమకు కొత్తగా నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Hema-2.jpg

మరోవైపు నటి హేమ సోమవారం ఉదయం ఫేస్‌బుక్‌ వేదికగా లైవ్‌లో మాట్లాడారు. ‘‘మనం తప్పు చేయనంత వరకూ ఎదుటివాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా దేవుళ్లం కాదు కదా! పొరపాటు జరిగినా సారీ చెప్పవచ్చు. అప్పుడు మనం ఫ్రెష్‌గా ఉంటాం. ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. 99 శాతం అబద్థాలు ఆడకుండా ఉండటం మంచిది. అందుకే నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను. ప్రస్తుతం నాకు ఎలాంటి షూటింగ్‌లు లేవు. మరీ అత్యవసరమైతేనే వెళ్తున్నాను’ అని హేమ అన్నారు.

Updated Date - May 27 , 2024 | 05:15 PM