Brahmanandam: సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’లో.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం

ABN , Publish Date - May 09 , 2024 | 04:04 PM

సుమంత్ హీరోగా రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు - 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. తాజాగా ఈ సినిమాలో విలక్షణ నటుడు బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు వెల్లడించారు.

Brahmanandam: సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’లో.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం
Brahmanandam

సుమంత్ (Sumanth) హీరోగా రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు - 2 చిత్రం మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi). ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేయ‌గా స‌ర్వ‌త్రా మంచి అద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్న‌ది. ఇటీవ‌లే టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ సైతం ఈ సినిమా గ్లిమ్స్ ఆసక్తికరంగా ఉందంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయ‌డం విశేషం.

WhatsApp Image 2024-05-09 at 3.32.22 PM.jpeg

ఇదిలాఉండ‌గా తాజాగా ఈ మహేంద్రగిరి వారాహి మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi) సినిమాలో విలక్షణ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి (Dheerendra Santhossh jagarlapu), నిర్మాత కాలిపు మధు వెల్లడించారు. మహేంద్రగిరి వారాహి స్క్రిప్ట్ అద్భుతంగా నచ్చి బ్రహ్మానందం ఈ సినిమా చేయబోతున్నారని, త్వరలో మొదలుకాబోయే షెడ్యూల్ లో ఆయ‌న‌ పాల్గొనబోతున్నారని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెలిపారు.


be8892ca-4676-403d-8156-98d0444ebce6.jpeg

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi) సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - May 09 , 2024 | 04:04 PM