Aarambham: స‌రికొత్త‌ థ్రిల్లర్ ‘ఆరంభం’ టీజర్ రిలీజ్.. ఇందులో ఏదో మ్యాట‌ర్ ఉన్న‌ట్టుందే

ABN , Publish Date - Feb 16 , 2024 | 07:14 PM

మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆరంభం’. డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను హీరో నాగ చైతన్య ఇవాళ రిలీజ్ చేశారు.

Aarambham: స‌రికొత్త‌ థ్రిల్లర్ ‘ఆరంభం’ టీజర్ రిలీజ్.. ఇందులో ఏదో మ్యాట‌ర్ ఉన్న‌ట్టుందే
Aarambham

మోహన్ భగత్ (Mohan bagath), సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ (Ravindra Vijay) కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆరంభం’ (Aarambham). ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి.టి (Abhishek) నిర్మిస్తుండగా, అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా టీజర్ ను హీరో నాగ చైతన్య (chaitanya akkineni) ఇవాళ రిలీజ్ చేశారు. మూవీ టీమ్ కు బెస్ట్ విషెష్ తెలిపారు.

WhatsApp Image 2024-02-16 at 6.26.55 PM.jpeg

ఈ సందర్భంగా.. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ‘ఆరంభం’ (Aarambham) టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందన్నారు. కొన్ని క్యారెక్టర్స్ లో గ్రే షేడ్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొత్తగా ఉన్నాయన్నారు. టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో రామాయణ స్టోరీ నెరేట్ చేస్తూ ఇంటర్ కట్స్ లో వేసిన విజువల్స్ తో టీజర్ డిఫరెంట్ గా కట్ చేశారు. ‘ఆరంభం’ (Aarambham) మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.


ఇప్పటిదాకా వినని ఒక కథ చెబుతానంటూ ఒక మహిళ చెప్పే కథతో ‘ఆరంభం’ (Aarambham) టీజర్ మొదలైంది. శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది. హనుమంతుడు తనను వెళ్లనివ్వడని తెలిసి శ్రీరాముడు తన ఉంగరాన్ని ఒక పుట్టలో జార విడుస్తాడు. ఆ ఉంగరం తెచ్చేందుకు హనుమంతుడు పుట్టలోకి వెళ్లి పాతాళ లోకం చేరుకుంటాడు. అక్కడ వాసుకి హనుమంతుడికి దారి చూపిస్తుంది .

పాతాళ లోకం వెళ్లిన హనుమంతుడికి అనేక ఉంగరాలు కనిపిస్తాయి. వీటిలో శ్రీరాముడి ఉంగరం ఏదని వాసుకిని హనుమంతుడు అడగగా.. ఇవన్నీ శ్రీరాముడివే అని వాసుకి చెబుతుంది. ఈ కథ వాయిస్ ఓవర్ వస్తుండగా.. ‘ఆరంభం’ (Aarambham) టీజర్ లో జైలు, ఒక కేసు వివరాలు, ఇతర క్యారెక్టర్స్, జరగనివి జరిగినట్లు అనిపించే డెజావు ఏంటి అనే అంశాలు చూపించారు. ఇవన్నీ టీజర్ పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Updated Date - Feb 16 , 2024 | 07:14 PM