Buddy: 'ఆ పిల్ల కనులే..' అల్లు శిరీష్ బడ్డీ నుంచి ఫస్ట్ లిరికల్

ABN , Publish Date - May 14 , 2024 | 05:06 PM

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బడ్డీ. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బడ్డీ సినిమా నుంచి ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఫస్ట్ సింగిల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు.

Buddy: 'ఆ పిల్ల కనులే..' అల్లు శిరీష్ బడ్డీ నుంచి ఫస్ట్ లిరికల్
buddy

అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బడ్డీ (Buddy). గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ (Studio Green) ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా (Gnanavelraja Ke), అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ (sam anton) దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

shirish.jpeg


యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బడ్డీ సినిమా నుంచి ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఫస్ట్ సింగిల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. రేపు (బుధ‌వారం) ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే.. #AaPillaKanule అంటూ సాగే పాట‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.

హిప్ హాప్ తమీజా (Hiphop Tamizha) ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇప్ప‌టికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ బడ్డీ (Buddy) సినిమా త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రానుండ‌గా రిలీజ్ డేట్ ను కొద్ది రోజుల్లో అనౌన్స్ చేయనున్నారు.

Updated Date - May 14 , 2024 | 05:13 PM