Buddy: అల్లు శిరీష్ ‘బ‌డ్డీ’ సినిమా నుంచి.. ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్

ABN , Publish Date - May 15 , 2024 | 03:27 PM

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న నూత‌న చిత్రం బడ్డీ. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండ‌గా శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Buddy: అల్లు శిరీష్ ‘బ‌డ్డీ’ సినిమా నుంచి.. ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్
buddy

అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా నటిస్తున్న నూత‌న చిత్రం బడ్డీ. (Buddy) గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ (Sam Anton ) దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

shirish.jpeg

తాజాగా ఈ రోజు (బుధ‌వారం) "బడ్డీ" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..స‌ (Aa Pilla Kanule) రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ (Hiphop Tamizha) ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు.


'ఆ పిల్ల కనులే చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..' అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

Updated Date - May 15 , 2024 | 03:27 PM