Aravind Krishna: 'ఏ మాస్టర్ పీస్' ఫస్ట్ లుక్

ABN , Publish Date - Apr 09 , 2024 | 01:31 PM

'శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, ఆషు రెడ్డి  కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Aravind Krishna: 'ఏ మాస్టర్ పీస్' ఫస్ట్ లుక్

'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్ పీస్' (A masterpiece). అరవింద్ కృష్ణ (Aravind krishna), జ్యోతి పూర్వాజ్(jyothy poorvaj), ఆషు రెడ్డి  (Ashu reddy)లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ భాగస్వామి అయ్యింది. ఈ సంస్థతో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల ఈ  సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు అందిస్తూ మేకర్స్ ఈ అనౌన్స్ మెంట్ చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నామని, అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో  ఈ చిత్రం రానుందని మేకర్స్ చెప్పారు. 

"భారీ క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ గా 'ఏ మాస్టర్ పీస్' ఉండబోతోందాని చెప్పారు. స్నేహ గుప్త, అర్చనా అనంత్, జయప్రకాశ్, చందు, మనీష్ గిలాడ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - Apr 09 , 2024 | 01:33 PM