Ester Noronha: ఆ పాత్ర నా ఫిజిక్ కు సరిపోదేమో అని భయపడ్డాను, కానీ...

ABN , Publish Date - Jan 06 , 2024 | 05:04 PM

ఎస్తర్ ఇప్పుడు దక్షిణాది భాషల్లో చాలా బిజీ అయిన నటి. ఎక్కువగా తెలుగులో కనపడుతోంది కూడా. ఈమధ్యనే విడుదలైన 'డెవిల్' లో పీరియడ్ లుక్ లో కనపడిన ఎస్తర్, ఇప్పుడు రాబోయే 'టెనంట్' సినిమాలో ఒక పోలీసాఫీసర్ పాత్రలో కనపడనుంది. రెండు సినిమాలు, రెండు వైవిధ్య పాత్రలు, వాటి గురించి ఆమె మాటల్లో...

Ester Noronha: ఆ పాత్ర నా ఫిజిక్ కు సరిపోదేమో అని భయపడ్డాను, కానీ...
Ester seen in two different roles in two different films

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా 'డెవిల్' ఈమధ్యనే విడుదలైంది. అభిషేక్ నామ దర్శకుడు, సంయుక్త కథానాయకురాలు. ఇందులో ఎస్తర్ ఒక చిన్న పాత్ర పోషించింది. 'డెవిల్' సినిమా నేపధ్యం అంతా 1945 సంవత్సరం కాలంనాడు జరిగే కథ. ఈ సినిమాలో ఎస్తర్ పాత్ర చిన్నదైనా అది కథలో కీలకలైన పాత్ర. ఒక జమిందారీ ఇంట్లో హత్య జరుగుతుంది, డెవిల్ అనే అతను ఆ హత్య ఎవరు చేశారో పరిశోధించడానికి వస్తాడు. ఆ పరిశోధనలో ఒకా తాళం చెవి ప్రధానం, అది ఎస్తర్ దగ్గర ఉంటుంది. అందులో ఎస్తర్ ఆ జమిందారీ కుటుంబంలో పనిచేసే అమ్మాయిగా కనపడుతుంది. దానికోసమని ఆమె వేషం, లుక్ అన్నీ ఒక వైవిధ్యంగా ఉండేట్టు మార్చుకుంది.

esterindevil.jpg

ఇప్పుడు ఎస్తర్ ఇంకో సినిమా చేస్తోంది. అది 'టెనంట్' ఇందులో ఆమె ఒక పోలీసాఫీసర్ పాత్ర చేస్తోంది. రెండు సినిమాలు, రెండు పాత్రలు ఎంతో వైవిధ్యంతో కూడుకున్నవి, ఒకదానికొకటి సంబంధం లేనిది. 'టెనంట్' లో పాత్ర గురించి మాట్లాడుతూ ఇది కూడా 'డెవిల్' లానే ఒక హత్యతో ముడిపడి వుంది అని చెప్తుంది, కానీ ఈ హత్యలో ఆమె భాగం కాదు, ఆమె ఈసారి ఆ హత్యని ఎవరు చేశారో పరిశోధిస్తుంది. "ఈ 'టెనంట్' ఒక ఆసక్తికరమైన కథతో కూడిన సినిమా. రెండు కుటుంబాలు ఉంటాయి, ఒక నేరం జరుగుతుంది. నేను అందులో నిజం ఏమిటో కనుక్కోవడానికి విచారణ చేసే విధానం నాకు నచ్చింది," అని చెప్పింది ఎస్తర్ పోలీసాఫీసర్ పాత్ర గురించి.

esterpoliceofficer.jpg

ఈ 'టెనంట్'లో దర్శకుడు తన పాత్రను, చాలా ఫ్రెష్‌గా ఊహించి బాగా రాశారు అని చెప్పింది. "ఇలాంటి పాత్ర వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నా ప్రస్తుత ఫిజిక్‌కి ఇలాంటి పాత్ర సరికాదని భావించాను, ఎందుకంటే నేను ఆ పాత్రకి సరిపోయేటట్టు దుస్తులను వేసుకోవడానికి మొదట చాలా సంకోచించాను. కానీ దర్శకుడు మాత్రం చాలా నమ్మకంగా, స్పష్టంగా నా పాత్ర గురించి ఉన్నాడు, కాబట్టి అతను సరిపోతుంది అని నమ్మాడు. దానితో నేను ఆ దుస్తులు వేసుకొని నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు, అలాగే నా టీమ్, చిత్ర యూనిట్, నేను నటించిన తరువాత మానిటర్‌ని చూసినప్పుడు, అలాగే తరువాత ట్రైలర్ చూసినప్పుడు ఆ పాత్ర వేసినందుకు నేను గొప్పగా భావిస్తున్నాను," అని చెప్పింది ఎస్తర్.

esterascop.jpg

"ఈ పాత్ర వెయ్యడానికి మొదట నేను సంకోచించినా, నా చుట్టూ వుండే వ్యక్తులు నన్ను ప్రోత్సహించి ఈ పోలీసాఫీసర్ పాత్ర వెయ్యడానికి నన్ను ప్రోత్సహించారు. నిజం చెప్పాలంటే నేను ఒక రకంగా అదృష్టవంతురాలిని, మంచి వ్యక్తులు నా చుట్టూ వుండి ప్రోత్సహిస్తున్నందుకు, ఇలాంటి పాత్రలు వస్తున్నందుకు," అని చెప్పింది ఎస్తర్.

ఇంతకు ముందు చేసిన 'డెవిల్' లోని పాత్ర గురించి మాట్లాడుతూ, అది కొంచెం నిడివి తక్కువైంది అని నా అభిమానులు అంటున్నారు.

esterglamour.jpg

"డెవిల్' లో పాత్ర కూడా ఒక వైవిధ్యంతో కూడుకున్నది. నా శ్రేయోభిలాషులు ఆ సినిమాలో నా పాత్ర నిడివి బాగా తగ్గిందని ఫిర్యాదు చేశారు, కానీ అది నాకు కొత్త పాత్ర, నన్ను నేను ఇంకో కొత్త లుక్ లో కనపడతాను, అదీ కాకుండా నా పాత్ర సినిమాలో కథకి ప్రాముఖ్యత ఉంటుంది, మొత్తం స్క్రిప్ట్‌కి నా పాత్రే కీలకం అయిందని నాకు తెలుసు, అందుకే నేను అది చెయ్యడానికి ఒప్పుకున్నాను," అని చెప్పింది ఎస్తర్.

esterglamourpic.jpg

"ఒక్కోసారి ప్రతి సినిమాలో ప్రతి పాత్ర ఎక్కువ నిడివి ఉండదు, అలాగే కొన్నిసార్లు ఒక పాత్ర సినిమా అంతటా ఉంటుంది కానీ నటనకు అవకాశాం ఉండదు. ఒక్కోసారి ఐదు నిమిషాల పాత్రే నాకు మంచి ప్రతిభ కనబరిచేటట్టు చేస్తుంది. అలాంటిదే ఇందులో పాత్ర, ఈ 'డెవిల్' సినిమాలో పాత్రని నేను పూర్తిగా ఆస్వాదించాను," అని చెప్పింది ఎస్తర్. దర్శకులు, రచయితలు తనని విభిన్న పాత్రల్లో చూపిస్తున్నందుకు అలాగే తన కోసం అందమైన పాత్రలను వ్రాస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది అని చెప్పింది.

Updated Date - Jan 06 , 2024 | 05:29 PM