పురాణాల్లో ఇచ్చే శాపాలని ఆధునికం చేసాం: యష్ పూరి

ABN , Publish Date - Jan 31 , 2024 | 02:12 PM

'చెప్పాలని ఉంది', 'అలాంటి సిత్రాలు', 'శాకుంతలం' వంటి సినిమాలతో టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. అతను కథానాయకుడిగా నటించిన సినిమా 'హ్యాపీ ఎండింగ్', ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈరోజు యష్ పూరి మీడియా సమావేశంలో తన సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.

పురాణాల్లో ఇచ్చే శాపాలని ఆధునికం చేసాం: యష్ పూరి
Yash Puri from Happy Ending

కథా నేపధ్యం

మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని మా డైరెక్టర్ కౌశిక్ 'హ్యాపీ ఎండింగ్' కథను డెవలప్ చేశారు. పురాణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితం ఎలా మారిపోయింది, ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం. సినిమాలో ఒక్క నిమిషం కూడా సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్, ఎంటర్ టైన్ తో సాగుతుంది. నా క్యారెక్టర్ శాపంతో ఇబ్బందులు పడినా, ప్రేక్షకులు మాత్రం నవ్వుకుంటారు. ఈ సినిమాలో ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కొత్తగా కనిపిస్తాయి. అలాగే ఎడిటింగ్, మ్యూజిక్, డీవోపీ ఇలా ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ ప్రతిభ ఈ సినిమాలో చూస్తారు. సినిమా చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు. చాలా మంది తమ ప్రమోషన్స్ లో బిగినింగ్ మిస్ అవ్వొద్దు, క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు అంటారు. కానీ ఈ సినిమాలో నిజంగానే బిగినింగ్, ఇంటర్వెల్ ఎంత ముఖ్యమో క్లైమాక్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి 15 నిమిషాలు ఒక ఎమోషనల్, సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు మా డైరెక్టర్. అది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. నేను ట్రైలర్ రిలీజ్ రోజే చెప్పాను మా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని. టీమ్ అంతా అదే నమ్మకంతో ఉన్నాం.

happyendingyashpuri.jpg

ఇప్పటి యువతకి నచ్చే అంశాలు ఏంటి

మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్ కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన సినిమా 'హ్యాపీ ఎండింగ్'. శాపమనే అంశం చుట్టూ కొంత యూత్ ఫుల్ అంశాన్ని బిగినింగ్ లో చూపించాం కానీ మా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదు. ఉంటే యూ/ఏ సర్టిఫికెట్ రాదు. నేను యు సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నా. యు/ఏ ఇచ్చారు. సో పిల్లలు, పెద్దలు అందరు కలిసి చూడొచ్చు. నాలాంటి కొత్త నటుడికి యంగ్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని చెప్పగలను. వాలెంటైన్స్ డే జరిగే వారంలో మా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. లవ్ ను మేము కొత్తగా సెలబ్రేట్ చేస్తున్నాం. పొయెటిక్, అండర్ స్టాండింగ్, స్పిరిచువల్ లవ్ ఉంటుంది. అది థియేటర్స్ లో చూడండి. మనం ఏదైనా విషయాన్ని ఓపెన్ గా చెబితే దాన్ని బోల్డ్ అనొచ్చు. అంతే గానీ అది ఫిజికల్ గా చూపించడం కాదు. శాపం అనేది లేకుంటే ఈ సినిమా కథ ప్రారంభం కాదు. ఒక యువకుడి ఫీలింగ్స్ బయటకు రాకుండా మనసులోనే ఉండిపోతే అతను ఎలా ఉంటాడు అనేది మా సినిమాలో కథానాయకుడి హర్ష్ క్యారెక్టర్.

yashpurihappyendingstill.jpg

భావోద్వేగాలకు పెద్దపీట

'హ్యాపీ ఎండింగ్' సినిమాలో పాటలు, కామెడీ బాగా వచ్చాయి. ట్రైలర్ బాగుందని చెబుతున్నారు. అయితే వీటన్నింటినీ కనెక్ట్ చేస్తూ కథలో బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. అదే ఈ సినిమా కథకు అసలైన పాయింట్. శాపం అనేది ఒక చిన్న డ్రైవింగ్ ఫోర్స్ మాత్రమే. కానీ కథలో చివరగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది ఎమోషన్ కే. శాపం ఉంటుంది కాబట్టి వాడు లవ్ ను ఫిజికల్ గా తన ప్రేయసితో చెప్పడు. వేరే పద్దతుల్లో పొయెటిక్ గా తెలియజేస్తాడు. అన్నీ దినుసులు ఉన్న ధమ్ బిర్యానీ లాంటి సినిమా ఇది.

హిట్ అవుతుందని నమ్మకం

సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాం. వినయంగానే చెబుతున్నాం మా సినిమా సక్సెస్ అవుతుందని. సినిమా ప్రారంభంలోనే శాపాన్ని రివీల్ చేస్తూ ఫస్టాఫ్ సరదాగా విష్ణుతో నేను చేసే కామెడీతో సాగుతుంది. సెకండాఫ్ లో ఎదురయ్యే కొన్ని ఘనటల వల్ల సినిమా ఎమోషనల్ అవుతుంది. నా క్యారెక్టర్ పేరు హర్ష్. కానీ అతని వ్యక్తిత్వం హార్ష్ గా ఉండదు. కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు అదే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నా. సెన్సార్ అయ్యాక కూడా నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి కొంతమంది సినిమా బాగుందంటూ మాట్లాడారు. సినిమా నచ్చడం వల్లే నాకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.

happyendingstill.jpg

కథే హీరో

'హ్యాపీ ఎండింగ్' సినిమాకు డెమో షూట్ చేశాం. 8 నిమిషాల ఆ షూట్ ఔట్ పుట్ చూశాక కౌశిక్ కు నా మీద, నాకు కౌశిక్ మీద, మా ఇద్దరి మీద సిల్లీ మాంక్స్ వాళ్లకు నమ్మకం ఏర్పడింది. మిగతా సినిమాల వాళ్లు ఇలా డెమో షూట్స్ చేస్తారో లేదో తెలియదు గానీ డెమో షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేశాను. సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ లో దాదాపు అంతా కొత్త వాళ్లే. ఈ యంగ్ టీమ్ కు నిర్మాత అనిల్ గారు సపోర్ట్ గా నిలిచి షూట్ కు పంపారు. ఔట్ పుట్ చూశాక ఆయన హ్యాపీగా ఉన్నారు. నేను నాలుగు సినిమాలు చేశాను. నేను కథానాయకుడిగా చేసిన గత సినిమాలోనూ స్టోరీనే హీరో అనుకుంటా. ఈ సినిమాలోనూ నేను సెకండ్ హీరో. ఫస్ట్ హీరో కథే.

కమర్షియల్ హీరోగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అయితే ఇప్పుడే వందమంది విలన్స్ ను స్క్రీన్ మీద కొట్టినట్లు చూపిస్తే ఎవరూ నమ్మరు. కథానాయకుడిగా స్థిరపడిన తర్వాత పక్కా కమర్షియల్ స్టైల్ లో మూవీస్ చేస్తా. త్వరలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తా.

Updated Date - Jan 31 , 2024 | 02:12 PM