Koratala Siva interview: మితిమీరిన ధైర్యం మంచిది కాదు

ABN , Publish Date - Sep 24 , 2024 | 05:36 PM

"అందరిలో భయం ఉండాలి. మితిమీరిన ధైర్యం మంచిది కాదు. మనలో ఉన్న భయాన్ని గౌరవించాలి. అది అందరికీ మంచిది. ఆ విషయాన్నే ఈ సినిమాలో చెప్పాను.

"అందరిలో భయం ఉండాలి. మితిమీరిన ధైర్యం మంచిది కాదు. మనలో ఉన్న భయాన్ని గౌరవించాలి. అది అందరికీ మంచిది. ఆ విషయాన్నే ఈ సినిమాలో చెప్పాను. మనకు ఇచ్చిన పనిని మనం ఎలా చేశామని చెక్‌ చేసుకోవడమే నా దృష్టిలో భయం’ అని అన్నారు దర్శకుడు కొరటాల శివ(Koratala Siva). ఎన్టీఆర్‌ (NTR)హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'దేవర’ (Devara). ఈ నెల 27న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు.  

నా దృష్టిలో తారక్‌ అంచనా కరెక్ట్‌గా ఉంటుంది. ఆయన ఏదైనా కరెక్ట్‌గా చెబుతారు. ఎక్కడా రాజీ పడరు. బాగుంటే బాగుందంటారు, బాలేకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తారు.. ఈ కథ చెప్పగానే చాలా ఆసక్తిగా ఉందన్నారు. ఆయన వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఆయన నాకు మంచి మిత్రుడు. మంచి సినిమా ఇవ్వాలని వందశాతం కష్టపడ్డాను. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే ఎన్టీఆర్‌ను తప్ప మరో హీరోను ఊహించుకోలేదు. ఆయన ఎప్పుడూ మాస్‌ హీరోనే. గత సినిమాలను దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చేశా. మనం ఒక పరీక్ష సరిగ్గా రాయకపోతే దాని తర్వాత పరీక్ష బాగా రాయాలని కచ్చితంగా అనుకుంటాం కదా. ఇదీ అంతే. ‘ఆచార్య’ విడుదలైన 20 రోజుల్లోనే నేను ఈ సినిమా పనుల్లో బిజీ అయిపోయాను. కథ నెరేషన్‌కు నాలుగు గంటలు పట్టింది. మొత్తం 6 గంటల సినిమా అవుతుంది. సెకండ్‌ షెడ్యూల్‌ చేేస సమయంలోనే రెండు పార్టులు చేయాలనిపించింది. ఇంత పెద్ద కథను ఒకే భాగంలో తెరకెక్కించడం కష్టం. అందుకే రెండు పార్టులుగా తీసుకొస్తున్నాం. ఎంతోమంది లెజెండరీ టెక్నీషియన్స్‌ దీనికి వర్క్‌ చేశారు. నేను ఐడియా ఇచ్చానంతే. వాళ్లే ఎక్కువ కష్టపడ్డారు.  
Devara-2.jpg
దురదృష్టకరం..

సినిమా పూర్తయింది. విడుదలకు వచ్చాం. టెన్షన్‌ అనను కానీ ఎగ్జామ్‌ రాసిన ఏ విద్యార్థికి అయిన ఉండే ఫీలింగ్‌ నాకూ ఉంది. ఏదైనా టీమ్‌ ఎఫెక్టే. నేను సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ను ఒకేలా తీసుకుంటాను. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు కావడం దురదృష్టం. మూడేళ్ల కష్టాన్ని ప్రేక్షకులతో అభిమానులతో పంచుకోవాలనుకున్నాం. అందరం ఏం మాట్లాడాలో  స్క్రిప్ట్  రాసుకున్నాం. రద్దు కావడం బాధ కలిగించింది. తెలుగులో ప్రమోషన్స్‌ తక్కువని అంటున్నారు. అలా ఏం లేదు. వరుసగా మీడియాతో ఇంటరాక్ట్‌ అవుతూనే ఉన్నాం. మార్కెటింగ్‌ విషయంలో నేను కొంచెం వీక్‌. నా కథకు న్యాయం చేయడం కోసమే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. నిర్మాతలను దృష్టిలో పెట్టుకుంటా. ప్రచారం విషయంలో వాళ్లకు ఐడియాలు  ఇస్తుంటా.

మార్పులు చేశా..   
సినిమా విడుదల తేదీలో మార్పు ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే.  ప్రమోషన్‌ కంటెంట్‌ ఫీడ్‌బ్యాక్‌తో చివరి క్షణం వరకూ మార్పులు చేస్తూనే ఉన్నాం. ఇది నా ఫస్ట్‌ పాన్‌ ఇండియా సినిమా. బడ్జెట్‌ను చూసుకోవడం చాలా టఫ్‌. అన్ని కోణాల్లో నిర్మాతలకు లాభాలు రావాలని చూస్తుంటాను. ఓటీటీ హక్కుల గురించి కూడా ఆలోచిస్తా. వాళ్లు  సేఫ్ లో  ఉండాలని కోరుకుంటా.

మన ఇంటి ఆడపిల్లలా
జాన్వీ సూపర్‌ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. రోజూ సెట్‌కు భయంతో వస్తుంది. తన డైలాగులు ముందే పంపాలని అడుగుతుంది. ఎంతో ప్రాక్టీస్‌ చేసుకొని సెట్‌కు వచ్చేది. మొదటి రోజు సీన్‌ అవగానే తన టాలెంట్‌ చూసి ఎన్టీఆర్‌, నేను సాక్‌ అయ్యాం. ఆ అమ్మాయి ఈ సినిమాలో చేయాలని అనుకుందట. అనుకోకుండా మేము కూడా తననే ఎంపిక చేశాం. మన ఇంటి ఆడ పిల్లలానే అనిపించింది. ఉత్తరాధి అమ్మాయి అని ఎక్కడా అనిపించలేదు. ఇక సైఫ్‌ విషయానికొస్తే.. ఈ పాత్రకు ఆయనే సరిపోతాడనిపించింది. ఆయన  లుక్‌ స్కెచ్‌ పంపాను. ‘నేను ఇలా ఉంటానా’ అని సైఫ్‌ ఆశ్చర్యపోయాడు. సెట్‌కు రాగానే గంటేసపు మేకప్‌కు కేటాయించేవారు.

Chiranjeevi.jpg

మొదటి మెసేజ్‌ చిరంజీవిగారే..
చిరంజీవిగారితో నాకు ఎప్పుడూ మంచి అనుబంధం ఉంది. ‘ఆచార్య’ ఫలితం తర్వాత నాకు మెేసజ్‌ పెట్టిన మొదటి వ్యక్తి చిరంజీవి గారు. ‘నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకురావాలి’ అని మెసేజ్‌ పంపారు. కొందరు ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంతే. మేమిద్దరం బాగానే ఉన్నాం.

మంచి పాటలు కుదిరాయి...
అనిరుద్ధ్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. ఫియర్‌ సాంగ్‌ చూడగానే నా ఉత్సాహం రెట్టింపైంది. అయతే అన్ని పాటలు ఒకేలా ఉండాలని లేదు. మెలోడీని, స్టోరీ పాటల్లో ప్రయోగాలు చేయొచ్చు. కానీ, డ్యాన్స్‌ బీట్స్‌కు ప్రయోగాలు చేయలేం. కొన్ని వినగా వినగా బాగుంటాయి. నా గత చిత్రాల పాటల్లాగే ఇవి కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంటాయి. ‘ఆయుధ పూజ’ పాటను రెండు రోజుల్లో విడుదల చేస్తాం. నాకు దేవిశ్రీప్రసాద్‌ కూడా మంచి హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేస్తా.

ద్వేషించకూడదు...
సోషల్‌ మీడియా లేకపోతే బతకలేమేమో అన్నట్లు లోకం తీరు ఉంది. దానిద్వారా చెడును ప్రచారం చేయొద్దని అందరికీ రిక్వెస్ట్‌ చేస్తున్నాను. మంచికి ఉపయోగించాలని కోరుకుంటున్నా. నెగెటివ్‌ కామెంట్‌ చేయడం వేరు.. ద్వేషించడం వేరు. కామెంట్‌ చేయడంలో తప్పులేదు కానీ.. ద్వేషించకూడదు.

Untitled-2.jpg
 

Updated Date - Sep 24 , 2024 | 05:36 PM