Chadalavada Srinivas Rao: సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి మెయిన్ ప్రాబ్లమ్ ఇదే..

ABN , Publish Date - Mar 05 , 2024 | 10:58 PM

చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు.

Chadalavada Srinivas Rao: సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి మెయిన్ ప్రాబ్లమ్ ఇదే..
Chadalavada Srinivas Rao

చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivas Rao) దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’ (Record Break). పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ సినిమాకు టైమ్‌తో పాటు భారీగా బడ్జెట్ పెట్టారని అంటున్నారు?

గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. ‘బిచ్చగాడు’ వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారు అనిపించింది. అందుకే ప్రజల మనసుకి హత్తుకునే విధంగా.. నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించాం.

‘రికార్డ్ బ్రేక్’ అనే టైటిల్ ఈ సినిమాకి జస్టిఫికేషన్ అని ఎలా అనుకున్నారు?

ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్.. అలాగే శనివారం మీడియాకు వేసిన షో లో వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఈ సినిమాకి ఇది కరెక్ట్ టైటిల్ అని చెప్పడంతో మాకు సంతృప్తిగా అనిపించింది. ఈ సినిమాకి ఇదే యాప్ట్ టైటిల్ అని అందరూ అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు. (Chadalavada Srinivas Rao Interview)


Chadalavada.jpg

క్లైమాక్స్ గ్రాఫిక్స్ ఇవి ముందే అనుకున్నారా?

సినిమాకి అది అవసరమని ముందే అనుకుని అంత ఖర్చు పెట్టి ఆ గ్రాఫిక్స్‌ని చేయించాం.

ఈ సినిమాకి హీరోలు వీళ్లే అని ముందే అనుకున్నారా?

ప్రజెంట్ ఉన్న హీరోల్లో అంత బాడీ ఉన్నవాళ్లు వెయిట్ పుటప్ చేయగలిగిన వాళ్లు ఎవరూ లేరు. అప్పటి కాలానికి ఒక రామారావు గారు, కృష్ణంరాజు గారు ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్‌గా సెట్ అయ్యారు.

కొత్త హీరోస్ పైన కొత్త వాళ్ళ పైన ఇంత బడ్జెట్ పెట్టడం అనేది కరెక్ట్ అనిపించిందా?

సినిమా రిలీజ్ అయ్యాక ప్రజలకు గుండెల్లో రికార్డ్ బ్రేక్ మంచి సినిమాగా నిలిచిపోవాలి. అందుకోసమే ఎక్కడ రాజీ పడకుండా తీసిన సినిమా ఇది.

ఈ సినిమాని ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి మీ పాషన్ ఏంటి?

ఎక్కడో తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసేవాడిని. సినీ కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నాకు మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నేను వాళ్లకు సపోర్ట్ చేయడం ఇలా ఇండస్ట్రీలో ఎదిగి ఈ పొజిషన్‌లో ఉన్నాను. నాకు నిద్రలో కూడా సినిమాలంటేనే ఇష్టం. (Chadalavada Srinivas Rao about Record Break)


అప్పట్లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ అనే సినిమా తీశారు ఇప్పుడు రికార్డ్ బ్రేక్? ప్రజెంట్ జనరేషన్‌ దృష్టిలో పెట్టుకునే చేశారా?

అప్పట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మంచి సినిమా. విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతంలో చాలా బాగా ఆడింది. అప్పుడున్న కాంపిటీషన్ కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ ‘రికార్డు బ్రేక్’ ఖచ్చితంగా మంచి సినిమాగా నిలుస్తుంది. నేటి జనరేషన్‌కి నేర్పించాలని అంశాలే ఈ రెండింటిలో ఉన్నాయి.

సినిమా చూసిన వారి రెస్పాన్స్ ఏంటి? ఆర్ నారాయణ మూర్తి‌గారు మాటలపై మీ స్పందన?

సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని అన్నారు. ఆర్.నారాయణమూర్తి గారు చెప్పిన దాని కంటే సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన విజయ నాగిరెడ్డి గారు రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ల ఇన్‌ఫుట్స్ తీసుకుని 2.45 నిమిషాల నిడివి గల సినిమాని 20 నిమిషాలు తగ్గించడం జరిగింది. అలా చేయడం వల్ల సినిమా క్వాలిటీ ఇంకా పెరిగింది.

సినిమా థియేటర్లు ఎక్కువ దొరికాయా?

థియేటర్లో ఎక్కువ దొరికినా కూడా నేనే ‘బిచ్చగాడు’ లాగా కొన్ని థియేటర్లు రిలీజ్ చేసి సినిమా సక్సెస్ తర్వాత పెంచుకుందామనుకుంటున్నాం. నాకు ఎన్ని థియేటర్లు అయినా ఇస్తారు కానీ నేనే ఒత్తిడి తీసుకురాకుండా మంచి సినిమాని తక్కువ ధియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాం.

ఈ సినిమాలో మీకు మనసుకు హత్తుకున్న సీన్ ఏదైనా ఉందా?

‘బిచ్చగాడు’ సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. కానీ ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్‌తో వచ్చాం. క్లైమాక్స్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం. అదేవిధంగా వాళ్లకి లడ్డూలు ఇష్టమని వాళ్ళు చైనా వెళుతున్న టైం లో తన బ్లడ్ అమ్మి లడ్డూలు తీసుకురావడం.. మీరు నా కోసం మన భారతదేశ కోసం గెలిచి రావాలి అనే సీన్ చాలా బాగా నచ్చింది. (Producer and Director Chadalavada Srinivas Rao)

మీరే సొంత బ్యానర్ లో డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి దీనిపై మీ అభిప్రాయం?

గతంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్టర్, హీరో ఒకటయ్యి ప్రొడ్యూసర్‌కి అంత విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే మెయిన్ ప్రాబ్లం.

మీ సంస్థ నుంచి, మీ నుంచి పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు ఆశించవచ్చా?

నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్ పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే.

అలా పెద్ద సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి మంచిది కదా?

నేను గతంలో చేసిన శోభన్ బాబు‌, నాగేశ్వరరావు‌, కృష్ణ.. వాళ్లు మహానుభావులు. నేను షూటింగ్ టైం కి వెళ్ళకపోయినా వాళ్ళు నాకంటే ముందే వచ్చి కూర్చుంటారు. నేను తీసిన డైరెక్టర్లు కూడా అజయ్ కుమార్, సదాశివరావు, కేఎస్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మహానుభావులు. నేను ఎవరిని పొగడట్లేదు కించపరచట్లేదు. నేను కింద నుంచి పైకి వచ్చాను నాలాగే కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.

ఈ సినిమాతో డైరెక్షన్ కంటిన్యూ చేస్తారా?

ఈ సినిమా ద్వారా నేను డైరెక్షన్ నేర్చుకున్నా. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వేల్యూస్‌తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్‌లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను.

Updated Date - Mar 05 , 2024 | 10:58 PM