మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anjali: గేమ్ ఛేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. అదేంటో నా సినిమాల‌న్నీ Gతో స్టార్ట్ అవుతున్నాయ్‌

ABN, Publish Date - Apr 08 , 2024 | 07:21 PM

అందాల నటి అంజలి న‌టించిన చిత్రం "గీతాంజలి మళ్లీ వచ్చిందిష‌ . ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అంజలి మీడియాతో మాట్లాడారు..

Geethanjali Malli Vachindhi

అందాల నటి అంజలి న‌టించిన‌ 'గీతాంజలి' ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం "గీతాంజలి మళ్లీ వచ్చింది" చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శక‌త్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ (KONA VENKAT) నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం. దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అంజలి మీడియాతో మాట్లాడుతూ ..

అదేంటో అన్ని G అనే అక్షరంతో స్టార్ట్ అయిన సినిమాలే చేస్తున్నా. అందులో ముందుగా ‘గీతాంజలి మళ్ళీవచ్చింది’ (Geethanjali Malli Vachindhi) రిలీజ్ అవుతుంది. అలాగే గేమ్ ఛేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రాబోతున్నాయి. అయితే మూడు సినిమాలు జోనర్స్ పరంగా డిఫరెంట్ గా ఉంటాయి.

గేమ్ ఛేంజర్ సినిమాను అన్నింటి కంటే ముందే స్టార్ట్ చేశాం. కానీ ఆలస్యమైంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది (Geethanjali Malli Vachindhi) సినిమాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కంటే ఆలస్యంగా స్టార్ట్ చేసినప్పటికీ ఇదే ముందుగా రిలీజ్ అవుతుంది. మూడు సినిమాల్లో నా పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటాయి.

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా పాయింట్ ను కోన వెంకట్ గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, తర్వాత ఈ సినిమాలో ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా కూడా వచ్చింది. అయితే సీక్వెల్ చేయాలనేది ఇప్పటిది కాదు.


‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi)..ఇదొక సీక్వెల్ కాబట్టి పాత క్యారెక్టర్స్ ను మార్చలేం. కాబట్టి కొత్త క్యారెక్టర్స్ ను స్టోరీలోకి తీసుకొచ్చాం. అలీగారు, సునీల్ గారు, సత్య.. పార్ట్ 1 ఎక్కడ ముగిసిదో సీక్వెల్ అక్కడ నుంచి మొదలవుతుంది. పార్ట్ వన్ చూడని వాళ్లకు కూడా సీక్వెల్ అర్థమవుతుంది.

గీతాంజలి సినిమాను తెరకెక్కించింది డెబ్యూ డైరెక్టర్. అలాగే ఇప్పుడు సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తుంది డెబ్యూ డైరెక్టర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ శివ తుర్లపాటిగారు కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయనకు షాట్ డివిజన్ మీద అవగాహన ఉంది. కాబట్టి డైరెక్షన్ చేయటం కష్టం కాదు. అయితే ఛాలెంజింగ్ సీక్వెల్ కాబట్టి ఆయన తన 100 పర్సెంట్ ఇచ్చారని నమ్ముతున్నాను.

ఇప్పటి వరకు నేను చేయనటువంటి పాత్రలకు ఢిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్నాను. క్లైమాక్స్ లో యాక్షన్ కూడా చేశాను. రొటీన్ గా చేస్తే నటిగా నాకు కూడా ఆసక్తి ఉండదు. కాబట్టి వీలైనంత కొత్తగా ఉండాలనే చూస్తాను.

శ్రీనివాస్ రెడ్డి (Srinivasa reddy), సత్యం రాజేష్ (Satyam rajesh) సహా అందరికీ ఓ కామెడీ టైమింగ్ ఉంది. సునీల్ (Suneel) గారితో కలిసి నేను చేస్తున్న సినిమా ఇది. వింటేజ్ సునీల్ గారిని చూడొచ్చు. సత్యగారు కూడా అంతే. అందరూ కలిసి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాం.

గీతాంజలి సినిమాలో తగినంత హారర్, తగినంత కామెడీ ఉంటుంది. అందుకనే ఆ సినిమా రిలీజ్ కాగానే ఆడియెన్స్ దాన్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది (Geethanjali Malli Vachindhi) సినిమా విషయానికి వస్తే, మూవీ ఫ్లేవర్ మార్చలేం. సాంకేతికంగా కొత్తగా ఉంటుంది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించాం.

నాకు ఉగాది పండుగ అంటే చాలా ఇష్టం. ఈ ఉగాదికి గీతాంజలి మళ్ళీ వచ్చింది (Geethanjali Malli Vachindhi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. హారర్, కామెడీ సహా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆడియెన్ గా హారర్ మూవీస్ ను బాగా ఎంజాయ్ చేస్తాను. తర్వాత మర్డర్ మిస్టరీ సినిమాలను చూడటానికి ఇష్టపడతాను.

గీతాంజలి మళ్ళీవచ్చింది (Geethanjali Malli Vachindhi) నా 50వ సినిమా కావటం హ్యాపీగా ఉంది. దీన్ని అందరూ గుర్తు చేస్తుంటే ఓ బాధ్యతగా అనిపిస్తుంది. 50 సినిమాలు చేసేశానా అనిపిస్తుంది. ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను.

Updated Date - Apr 08 , 2024 | 07:21 PM