Goat: అప్‌డేట్‌ ఇచ్చిన సంగీత దర్శకుడు!

ABN , Publish Date - May 27 , 2024 | 07:46 PM

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ (Vijay) హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది గోట్‌’(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ - The goat) ). చిత్రీకరణ శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రం గురించి సంగీత దర్శకుడు ఓ మ్యూజికల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

Goat: అప్‌డేట్‌ ఇచ్చిన సంగీత దర్శకుడు!

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ (Vijay) హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది గోట్‌’(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ - The goat) ). చిత్రీకరణ శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రం గురించి సంగీత దర్శకుడు ఓ మ్యూజికల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఆనందిస్తున్నారు. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న యువన్‌ శంకర్‌ (Yuvan Shankar raja) ‘ది గోట్‌’ పాటల అప్‌డేట్‌ ఇచ్చారు. ‘విజయ్‌ ఈ సినిమా కోసం రెండు పాటలు పాడారు. ఒకే సినిమాలో ఆయన రెండు పాటలు పాడడం ఇదే మొదటిసారి’’ అని వెల్లడించారు.

గతంలో కూడా విజయ్‌ తన చిత్రాల్లో పాడిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు ఇప్పటిదాకా ఆయన 25 పాటలు పాడారు. 1994లో విడుదలైన ‘రసిగన్‌’ కోసం మొదటిసారి పాడిన విజయ్‌ ఆ తర్వాత సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు.  2012లో ‘తుపాకీ’లో ‘గూగుల్‌ గూగుల్‌’ పాటకు ‘ఫేవరెట్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇప్పటివరకు తన చిత్రాల్లో ఒక్కో పాట పాడిన విజయ్‌ దీనికి మాత్రం రెండు పాటలు పాడటం విశేషం. ఇక తాజాగా ‘ది గోట్‌’లో విజయ్‌ పాడిన ‘విజిల్‌ పోడు’ లిరికల్‌ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా అది మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.  కోట్ల వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.  ఇక ఈ చిత్రంలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడారు. ఈ టెక్నాలజీతో ఆయన్ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. విజువల్‌ ఎఫెక్ట్‌ పనులే కూడా ఇటీవలే పూర్తయ్యాయి. అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లోని స్టూడియోలో ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’ లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌కి పనిచేసిన నిపుణులు ఈ చిత్రం కోసం వర్క్‌ చేశారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రధారులు.  స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated Date - May 27 , 2024 | 07:47 PM