YogiBabu: యోగిబాబు హీరోగా.. కొత్త చిత్రం ‘జోర కైతట్టుంగ’

ABN , Publish Date - May 30 , 2024 | 10:03 AM

యోగిబాబు ప్రధాన పాత్ర లో ‘జోర కైతట్టుంగ’ అనే పేరుతో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, శక్తి ఫిలిమ్స్‌ అధినేత శక్తివేలన్‌ తాజాగా రిలీజ్‌ చేశారు.

YogiBabu: యోగిబాబు హీరోగా.. కొత్త చిత్రం ‘జోర కైతట్టుంగ’
yogibabu

ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్ర లో ‘జోర కైతట్టుంగ’ (Jora Kaiya Thattunga) అనే పేరుతో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంది. ‘తీకులిక్కుం పచ్చై మరం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన వినీష్‌ మిలీనియం ఈ సినిమాకు డైరెక్షన్‌ చేస్తున్నారు. వామా ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానరులో జహీర్‌ అలీ (zakir ali) నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, శక్తి ఫిలిమ్స్‌ అధినేత శక్తివేలన్‌ తాజాగా రిలీజ్‌ చేశారు.

GOe4ofYboAAe34X.jpeg


జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్‌ మధు అంబాట్‌ ఛాయాగ్రహణం అందించే ఈ చిత్రానికి ఎడిటింగ్‌ సాబు జోసెఫ్‌, నేపథ్య సంగీతం జితన్‌ రోషన్‌, సంగీతం ఎస్‌.ఎన్‌.అరుణగిరి. యోగిబాబు స్ర్కీన్‌ జర్నీలో ఈ చిత్రం ఒక కీలక మలుపు చిత్రంగా నిలుస్తుందని, చిత్ర నిర్మాణం పూర్తి చేసుకోగా, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని దర్శకుడు వినీష్‌ తెలిపారు. ఇందులో హరీష్‌ ప్యారెడీ, విక్రమ్‌ ఫేం వాసంతి, జాహీర్‌ అలీ, మణిమారన్‌, శాంతిదేవి, మేనక, నైరా అరువి బాలా, మూర్‌, శ్రీధర్‌ తదితరులు నటించారు.

Updated Date - May 30 , 2024 | 10:03 AM