Yash: గుడ్‌ న్యూస్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు.. కానీ..

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:02 PM

కేజీఎఫ్‌'(KGF) సిరీస్‌ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యశ్. ఇటీవల తన కొత్త సినిమా వివరాలు వెల్లడించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అప్పుడే చెప్పారు. జనవరి 8న యశ్‌ (yash) పుట్టినరోజు సందర్భంగా ఆయన గుడ్‌ న్యూస్‌ చెబుతారని ఎదురుచూస్తున్నారు.

Yash:  గుడ్‌ న్యూస్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు.. కానీ..

'కేజీఎఫ్‌'(KGF) సిరీస్‌ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యశ్. ఇటీవల తన కొత్త సినిమా వివరాలు వెల్లడించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అప్పుడే చెప్పారు. జనవరి 8న యశ్‌ (yash) పుట్టినరోజు సందర్భంగా ఆయన గుడ్‌ న్యూస్‌ చెబుతారని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన బర్త్‌డేపై యశ్‌ ఓ పోస్ట్‌ చేశారు.

‘‘మీరంతా నా పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. నన్ను వ్యక్తిగతంగా కలిసి విషెస్‌ చెప్పాలని అభిమానులంతా ఆశపడుతున్నారు. నన్ను నమ్మండి.. మీతో కలిసి సమయాన్ని గడపడం నాకు అత్యంత విలువైన వాటిలో ఒకటి. కానీ, మనమంతా మరో రోజు కలుద్దాం. జనవరి 8న నేను అందుబాటులో ఉండను. ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేకపోయినా.. మీ అందరి విషెస్‌ నా హృదయానికి చేరతాయి. అవి నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. నాతోనే ఉంటాయి’’ అని రాసుకొచ్చారు.

ఇక యశ్‌ కొత్త చిత్రానికి ‘టాక్సిక్‌’ (ToXic) అనే పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్  దాస్‌ దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా   కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే  బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు కూడా టాక్‌ నడుస్తోంది. ‘కేజీయఫ్‌’ చిత్రాల తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Updated Date - Jan 05 , 2024 | 07:03 PM