విశాల్ ‘రత్నం’ సంక్రాంతి స్పెషల్ పోస్టర్.. వేసవిలో విడుదల

ABN , Publish Date - Jan 16 , 2024 | 06:02 PM

మాస్ యాక్షన్ హీరో విశాల్ రత్నంచిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు.

విశాల్ ‘రత్నం’ సంక్రాంతి స్పెషల్ పోస్టర్.. వేసవిలో విడుదల
RATHNAM

మాస్ యాక్షన్ హీరో విశాల్(Vishal) రత్నం (Rathnam) చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రాన్ని హరి(Hari) డైరెక్ట్ చేస్తుండగా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ (Vishal) హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటి వరకు వదిలిన ప్రతీ అప్డేట్ అందరినీ ఆకట్టుకున్నాయి.

తాజాగా విశాల్ తన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ రత్నం (Rathnam) సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో విశాల్ ఉగ్రరూపాన్ని చూపించారు. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో కాళీ మాతను కూడా చూపించారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే తెరపై ఊచకోత గ్యారెంటీ అన్నట్టుగా కనిపిస్తోంది.


సమ్మర్‌లో రత్నం (Rathnam) సినిమాను విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా అప్డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు.

Updated Date - Jan 16 , 2024 | 06:02 PM