మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

The Greatest of All Time: విజయ్‌ పాటతో సందడి..

ABN, Publish Date - Mar 12 , 2024 | 11:08 AM

గత ఏడాది 'వారిసు', 'లియో' చిత్రాలతో ఆకట్టుకున్నారు విజయ్‌ (Vijay). ఈ ఏడాది 'గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’(The Greatest of All Time)తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో  పాన్  ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది.



గత ఏడాది 'వారిసు', 'లియో' చిత్రాలతో ఆకట్టుకున్నారు విజయ్‌ (Vijay). ఈ ఏడాది 'గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’(The Greatest of All Time)తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో  పాన్  ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి కథానాయిక.  చిత్రీకరణ  శరవేగంగా జరుగుతోంది. యువన శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం విజయ్‌ స్వయంగా ఓ పాట పాడుతున్నారని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.  దీనిపై సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా కూడా స్పష్టత ఇచ్చారు. ఇటీవల బెంగళూరులోని ఓ కాన్సెర్ట్‌లో పాల్గొన్న యువన్  తమ రాబోయే సినిమా కోసం విజయ్‌ గాత్రంతో ఓ పాట రికార్డు చేసినట్లు వెల్లడించారు. ఈ గీతానికి వెంకట్‌ ప్రభు తండ్రి గంగై అమరన్‌ సాహిత్యం అందించినట్లు సమాచారం. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌, ప్రభుదేవా,స్నేహ, లైలా తదితరులు కీలక పాత్రధారులు.

Updated Date - Mar 12 , 2024 | 11:08 AM