మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijay: కేరళలో అభిమానుల అత్యుత్సాహం..ఆ ప్రేమకు చలించిపోయాడు

ABN, Publish Date - Mar 19 , 2024 | 12:02 PM

సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లిన నటుడు విజయ్ (Vijay) కారు అద్దాలను అభిమానులే పగలగొట్టడం కలకలం రేపింది.  విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు (venkat prabhu) దర్శకత్వంలో 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలో నటిస్తున్నారు.

సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లిన నటుడు విజయ్ (Vijay) కారు అద్దాలను అభిమానులే పగలగొట్టడం కలకలం రేపింది.  విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు (venkat prabhu) దర్శకత్వంలో 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (the gretest of all time) సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కోసం విజయ్ మంగళవారం కేరళ వెళ్లాడు.


తలైవా.. తలైవా.. తలపతి.. తలపతి అంటూ నినాదాలు చేస్తూ దారి పొడవునా సందడి చేస్తూ వెళ్లారు అభిమానులు. ఈ సందర్భంలో విజయ్‌ని చూసేందుకు అభిమానులు అధికంగా రావడంతో పాటు కారు మీద పడడంతో విజయ్ ప్రయాణిస్తున్న కారు అద్దం పగిలిపోయింది. కారు కూడా జనంలో ఇరుక్కుపోయి కదలలేక పోయింది. లోపల కూర్చున్న విజయ్ కూడా కొంచెం కంగారు పడ్డాడు. అభిమానుల తాకిడికి కారు అద్దాలు పగిలిపోయాయి.  కారు వెనుక, ముందు భాగాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ కేరళ వస్తున్నాడని తెలుసుకున్న కేరళ విజయ్ అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. తమ ప్రేమను ఎలా వ్యక్తపరిచారో చూసి విజయ్ చలించిపోయాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరువనంతపురంలోని ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోయింది. అభిమానులు విజయ్ కారును నలువైపుల నుంచి చుట్టుముట్టి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో నటుడు విజయ్ చాలా కష్టపడి హోటల్‌కు చేరుకున్నాడు. ఇక ఆయన కారు ధ్వంసమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, స్నేహ, అజ్మల్ అమీర్, ప్రేమ్ జీ అమరన్, యోగి బాబు, వీ టీవీ గణేష్, వైభవ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సింపుల్ లుక్ లో కనిపిస్తున్నారు. 

Updated Date - Mar 19 , 2024 | 12:17 PM