Vijay : నియోజకవర్గాల వారీగా విద్యార్థులుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jun 11 , 2024 | 06:10 PM

కష్టం అంటే ఆదుకోవడానికి ముందుంటారు కోలీవుడ్‌ హీరో విజయ్‌(Vijay). అలాగే ప్రతిభను ప్రోత్సహించడంలోనూ ఆయనకు ఆనే సాటి. తాజాగా మరోసారి ఆయన మంచి మనసు చాటుకున్నారు.

Vijay : నియోజకవర్గాల వారీగా విద్యార్థులుకు ప్రోత్సాహం

కష్టం అంటే ఆదుకోవడానికి ముందుంటారు కోలీవుడ్‌ హీరో విజయ్‌(Vijay). అలాగే ప్రతిభను ప్రోత్సహించడంలోనూ ఆయనకు ఆనే సాటి. తాజాగా మరోసారి ఆయన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల వచ్చిన  పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందించనున్నారు విజయ్‌. ఈ విషయాన్ని ఆయన పార్టీ  ‘తమిళగ వెట్రి కళగం’ (Tamilaga Vettri Kazhagam)ప్రతినిధులు వెల్లడించారు. గడిచిన సంవత్సరం ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థినికి విజయ్‌ డైమండ్‌ నెక్లెస్‌ కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా  మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు కూడా మరోసారి విద్యార్థులకు సాయం చేయనున్నారు. ఈ ఏడాదిలో టాపర్లుగా నిలిచిన వారికి సర్టిఫికెట్‌తో పాటు రివార్డులను అందజేయనున్నారు. జూన్‌ 28, జులై 3 తేదీల్లో చెన్నై వేదికగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్‌, ఇంటర్‌లో టాప్‌ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. ఇటీవల కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

ఇక విజయ్‌ సినిమాల విషయానికొస్తే..  ‘ది గోట్‌’ (The goat - ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌)తో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. . స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడారు. ఈ టెక్నాలజీతో ఆయన్ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు.  ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’ లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు  పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్‌’ సినిమా కోసం వర్క్‌ చేశారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. ేస్నహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - Jun 11 , 2024 | 06:55 PM