Janagaraj: ఫేమ‌స్ క‌మెడియ‌న్.. ఏంటి ఇలా అయిపోయాడు

ABN , Publish Date - May 09 , 2024 | 06:49 PM

ఒక‌ప్పుడు త‌మిళ‌నాట వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ప్ర‌ఖ్యాత క‌మెడియ‌న్ జ‌న‌క‌రాజ్. చాలా రోజుల త‌ర్వాత ఆయ‌న‌ న‌టించిన ఓ చిత్రం త్వ‌ర‌లో ముందుకు రానుంది. ఈక్ర‌మంలో తాజాగా ఆయ‌న ఫొటోల‌ను చూసిన‌వారంతా షాక్ అవుతున్నారు.

Janagaraj: ఫేమ‌స్ క‌మెడియ‌న్.. ఏంటి ఇలా అయిపోయాడు
janagaraj

ర‌జ‌నీకాంత్ హీరోగా వ‌చ్చిన భాష సినిమా సౌత్ ఇండియాలో ఎంత ప్ర‌కంప‌న‌లు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ఆ సినిమాకు ఎంత పేరు వ‌చ్చిందో అందులో న‌టించిన వారికి కూడా అంత‌కుమించి మంచి గుర్తింపు వ‌చ్చి త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో దూసుకుపోయారు. ఆ సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశం, డైలాగ్స్ ఇప్ప‌టికీ చాలా మంది ప్రేక్ష‌కుల క‌ళ్ల‌ ముందు క‌దులుతాయంటే అతిశ‌యోక్తి కాదు.

jana.jpg

ముఖ్యంగా ఓ స‌న్నివేశంలో న‌గ్మ రోడ్డుపైన న‌డుచుకుంటూ వ‌చ్చి ఓ ఆటో ఎక్క‌డం డ్రైవ‌ర్ బండి స్టార్ట్ చేసి తోటి డ్రైవ‌ర్స్‌కు బాయ్ అంటూ చెప్పి గేర్ వేయ‌గానే ముందుకుపోయి అగిపోవ‌డం అలా రెండు మూడు సార్లు జ‌ర‌గ‌డంతో హీరోయిన్ ప‌క్క‌నే ఉన్న‌ ర‌జ‌నీకాంత్ ఆటో ఎక్కి వెళ్లిపోయే స‌న్నివేశం విప‌రీత‌మైన వినోదాన్ని పంచుతుంది. అందులో ఆటో డ్రైవ‌ర్‌గా చేసిన న‌టుడి పేరు జ‌న‌క‌రాజ్ (Janagaraj) ఆ సినిమాలో ర‌జ‌నికాంత్ ప్ర‌ధాన అనుచ‌రుడిగా చివ‌రి వ‌ర‌కు క‌నిపిస్తాడు. క‌మ‌ల్‌హ‌స‌న్‌తో నాయ‌కుడు, గుణ‌, విచిత్ర స‌హోద‌రులు, చిరంజీవితో జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి వంటి సినిమాల్లో న‌టించారు.

DGOILVZUIAAeF1I.jpg


అయితే ఆ సినిమా త‌ర్వాత ఏడాదికి పాతిక సినిమాల్లో న‌టించేంత‌గా జ‌న‌క‌రాజ్ చాలా బిజీ అయిపోవ‌డ‌మే కాక టాప్ క‌మెడియ‌న్ లిస్టులో చేరిపోయారు. 2000 సంవ‌త్స‌రం త‌ర్వాత నుంచి అద‌పాద‌డ‌ప మాత్ర‌మే సినిమాలు చేస్తూ వ‌స్తున్న‌ ఆయ‌న చివ‌ర‌గా విజ‌య్‌సేతుప‌తి 96 సినిమాలో క‌నిపించి మెప్పించారు.

thatha-review252024m1.jpg

తాజాగా చాలా రోజుల త‌ర్వాత జ‌న‌క‌రాజ్ (Janagaraj) ప్ర‌ధాన‌పాత్ర‌లో తాత అనే షార్ట్ ఫిలింలో న‌టించ‌గా త్వ‌ర‌లో విడుద‌ల‌కు రెడీ అయింది. అయితే ఈ ట్రైల‌ర్ చూసిన వారంతా జ‌న‌క‌రాజ్ ఎంటీ ఇలా అయిపోయాడు, ఆయ‌న‌కు ఏమైందంటూ సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే అనారోగ్య స‌మ‌స్య‌లేమి లేవ‌ని వ‌యోభారం వ‌ళ్ల అలా క‌నిపిస్తున్నా అంటూ ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

janagaraj.jpg

Updated Date - May 09 , 2024 | 06:49 PM