‘UI’ ఫ‌స్ట్ లుక్‌.. ఏంది సామి ఈ అరాచ‌కం! ఉపేంద్ర ఈజ్ బ్యాక్‌

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:34 PM

కన్నడ రియ‌ల్‌ స్టార్ ఉపేంద్ర కబ్జా చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం యూఐ(U I). ఈ చిత్రం నుంచి తాజాగా సినిమా థీమ్‌, క్యారెక్ట‌ర్స్‌తో ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటున్న‌ది.

‘UI’ ఫ‌స్ట్ లుక్‌.. ఏంది సామి ఈ అరాచ‌కం! ఉపేంద్ర ఈజ్ బ్యాక్‌
u i upendra

కన్నడ రియ‌ల్‌ స్టార్ ఉపేంద్ర (Upendra) కబ్జా చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం యూఐ(U I The Movie) . ఏడాది క్రితం మొద‌లుపెట్టిన ఈ సినిమా ఇంకా షూటింగ్ న‌డుస్తూనే ఉంది. దాదాపు ఏడేండ్ల త‌ర్వాత ఉపేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం. మూడు నెల‌ల క్రితం మొద‌టిసారి డిఫ‌రెంట్‌గా కేవ‌లం వాయిస్‌తో ఈ సినిమా నుంచి ఓ టీజ‌ర్‌ను విడుద‌ల చేసి ఇంట‌ర్నెట్‌ను షేక్ చేశాడు. మ‌ళ్లీ ఇన్నాళ్లకు సినిమా థీమ్‌, క్యారెక్ట‌ర్స్‌తో ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

సోమ‌వారం బెంగళూరులో జరిగిన ఈ టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మానికి క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్‌కుమార్ (Shiva raj kumar), ఉపేంద్ర‌, తెలుగు స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ముఖ్య అతిథులుగా హ‌జ‌ర‌య్యారు. రీష్మా నానయ్య (Reeshma Nanaiah) క‌థానాయుక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మనోహరన్- శ్రీకాంత్ కేపీ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు.


వ‌ర‌ల్డ్ ఆఫ్ యూఐ (‘U I’) పేరిట విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ గ‌తంలో వ‌చ్చిన ఉపేంద్ర టైప్ అఫ్ మూవీస్‌లానే చాలా వైరైటీగా ఉంది. ఫిక్ష‌న‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో, ఔట్ అండ్ ఔట్ ర‌స్టిక్ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌గా సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఉపేంద్ర (Upendra) దున్న‌పోతుపై ఎంట్రీ ఇచ్చే సీన్ గూస్‌బంప్స్ తెచ్చే విధంగా ఉంది. ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ విడుద‌ల చేసిన గంట‌లోనే మిలియ‌న్ వ్యూస్ పైగా సాధించింది. ఇదిలాఉండ‌గా ఈ సినిమాను వేస‌విలో దేశ‌వ్యాప్తంగా 8 భాష‌ల్లో విడుద‌ల చేయ‌నుండ‌డం విశేషం.

Updated Date - Jan 08 , 2024 | 04:34 PM