ఆరంభం అదిరింది.. మమ్ముట్టి సినిమాతో కొత్త అడియో కంపెనీ ఎంట్రీ

ABN , Publish Date - Jan 01 , 2024 | 06:40 PM

సరిహద్దులను చెరిపేస్తూ, వివిధ మాధ్యమాల్లో ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టిస్తూ, డైనమిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా పేరు తెచ్చుకుంది 'నైట్ షిఫ్ట్ స్టూడియోస్. తాజాగా 'నైట్ షిఫ్ట్ రికార్డ్స్ పేరిట ఓ నూత‌న‌ మ్యూజిక్ లేబుల్‌ను ఆవిష్క‌రించింది.

ఆరంభం అదిరింది.. మమ్ముట్టి సినిమాతో కొత్త అడియో కంపెనీ ఎంట్రీ
night shift

సరిహద్దులను చెరిపేస్తూ, వివిధ మాధ్యమాల్లో ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టిస్తూ, డైనమిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా పేరు తెచ్చుకుంది 'నైట్ షిఫ్ట్ స్టూడియోస్. తాజాగా 'నైట్ షిఫ్ట్ రికార్డ్స్ పేరిట ఓ నూత‌న‌ మ్యూజిక్ లేబుల్‌ను ఆవిష్క‌రించింది. ఇక‌పై 'నైట్ షిఫ్ట్ రికార్డ్స్ సొంత ప్రొడక్షన్స్ నుంచి అద్భుతమైన కంపోజిషన్‌లను అందిస్తామ‌ని, సంగీత ప్రపంచానికి విభిన్న దేశాల సంగీతాన్ని ద‌గ్గ‌ర చేయ‌డ‌మే కాకుండా స్వతంత్ర కళాకారులతో కలిసి పని చేయడం ద్వారా సంగీత పరిశ్రమలో విలక్షణమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపింది.

night.jpeg

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ "నైట్ షిఫ్ట్ రికార్డ్స్ (Night Shift Record's) ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామ‌ని, ఈ మ్యూజిక్ లేబుల్, కళాత్మక నైపుణ్యం మరియు సృజనాత్మక పట్ల నిబద్ధతతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అల‌రించే సంగీతాన్నిసేక‌రించి అందించ‌డ‌మే మా లక్ష్యం." అని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ వ్యవస్థాపకులు, నిర్మాత రామచంద్ర చక్రవర్తి తెలిపారు.


n.jpegఇదిలాఉండ‌గా మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి (Mammootty) న‌టించిన క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్న‌ చిత్రం 'భ్రమయుగం ( Bramayugam) యొక్క సౌండ్ ట్రాక్ ఈ మ్యూజిక్ లేబుల్ నుంచి మొదట విడుదల విడుదల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Updated Date - Jan 01 , 2024 | 06:40 PM