Trisha: దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉంది

ABN , Publish Date - Feb 22 , 2024 | 03:43 PM

నటి త్రిషపై (Trisha) అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే (AIADMK) మాజీ నాయకుడు ఏవీ రాజుపై (AV RAJU) ఆమె న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు పరువు నష్టం దావా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా సదరు వివరాలను పోస్ట్‌ చేశారు.

Trisha: దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉంది


నటి త్రిషపై (Trisha) అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే (AIADMK) మాజీ నాయకుడు ఏవీ రాజుపై (AV RAJU) ఆమె న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు పరువు నష్టం దావా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా సదరు వివరాలను పోస్ట్‌ చేశారు. ఇటీవల మీడియా సమావేశంలో ఏవీ రాజు మాట్లాడుతూ.. త్రిషను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వార్తలు వీడియోలో, సామాజిక మాధమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హీరోయిన్  త్రిషకు ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సపోర్ట్‌గా నిలిచారు. 

త్రిష స్పందిస్తూ "అటెన్షన్‌ కోసం ఏ  స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉంటుంది’’ అని అసహనం వ్యక్తం చేశారు.ఆ వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే వస్తుందని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే భారీ నష్టపరిహారం చెల్లించాలని లీగల్‌ నోటీస్‌లు పంపారు. ఎమ్మెల్యే జి.వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన రాజు.. త్రిష వ్యక్తిగత జీవితంపైనా కామెంట్‌ చేశారు.

Trisha.jpeg

కెరీర్‌ ప్రారంభించి ఇరవై ఏళ్లకు పైనే అయినా ఇప్పటికీ స్టార్‌ హీరోయన్  కేటగిరీలోనే ఉంది త్రిష. గత ఏడాది మూడు చిత్రాలతో అలరించిన ఈ చెన్నై బ్యూటీ ఈ ఏడాది ఐదు చిత్రాలతో బిజీగా ఉంది. వాటిలో ఒకటి చిరంజీవి సరసన 'విశ్వంభర' చిత్రం ఒకటి. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘స్టాలిన్ ’ తర్వాత చిరంజీవి సరసన త్రిష నటిస్తున్న చిత్రమిది. 

Updated Date - Feb 22 , 2024 | 04:39 PM