Yash: పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... ముగ్గురు మృతి!

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:50 PM

కన్నడ హీరో, కేజీఎఫ్‌ ఫేం (KGF Fame) యశ్ (yash) పుట్టినరోజంటే అభిమానులకు పండగే. కేజీఎఫ్‌ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. సోమవారం యశ్ పుట్టినరోజు

Yash: పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... ముగ్గురు మృతి!

కన్నడ హీరో, కేజీఎఫ్‌ ఫేం (KGF Fame) యశ్ (yash) పుట్టినరోజంటే అభిమానులకు పండగే. కేజీఎఫ్‌ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. సోమవారం యశ్ పుట్టినరోజు. ఆ సెలెబ్రేషన్స్లో దుర్ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకాకు చెందిన ముగ్గురు ఫ్యాన్స్ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. లక్ష్మేశ్వర్‌ తాలుకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యశ్‌ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్‌ చేయాలని భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్‌ (21), నవీన్‌ ఘాజీ (19) ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో దగ్గర్లో ఉన్న లక్ష్మేశ్వర్‌ ఆస్పత్రికి తరలించారు. యశ్‌ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అర్థరాత్రే భారీగా అభిమానులు తరలివచ్చారు. గత నాలుగేళ్లుగా యష్‌ తన పుట్టినరోజును అభిమానులతో సెలబ్రేట్‌ చేసుకోలేదు. ఈ ఏడాది కూడా వ్యక్తిగత పనులతో బిజీగా ఉండడం వల్ల అభిమానుల్ని కలవడం కుదరదని ముందే చెప్పాడు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ మీరకే ఓ లేఖ రాసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘జనవరి 8.. నాపై మీకున్న ప్రేమను వ్యక్తిగతంగా చెప్పాలనుకునే రోజు.. పుట్టినరోజు మీతో గడపాలని నాకూ ఉంది. కొత్త సినిమా పనుల వల్ల కాస్త బిజీగా ఉన్నా. అనివార్యమైన ప్రయాణాల కారణంగా జనవరి 8న మిమ్మల్ని కలవలేక పోతున్నాను. మీ ప్రేమ వెలకట్టలేనిది.. నా పుట్టునరోజు నాడు నేను మీతో గడపలేకపోతున్నాననే బాధ నాలో ఉంది. మీరు కూడా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను.. నేను ఎక్కడ ఉన్నా మీరందరూ నాతోనే ఉంటారు. మీ ప్రేమ, అభిమానాలే నాకు పుట్టినరోజు కానుక.’ అని యష్‌ ఇటీవల ట్వీట్‌ చేశారు. (Fans died with Current shock)

'కేజీఎఫ్‌' తర్వాత ఆయన తదుపరి చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయన టాక్సిక్‌ చిత్రంలో నటించనున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహనదాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 02:11 PM