Rajinikanth: 'తలైవా 171' టైటిల్‌ ఏంటో తెలుసా? 

ABN , Publish Date - Apr 22 , 2024 | 06:49 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ - దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న 171వ చిత్రమిది. ఈ చిత్రానికి 'కూలీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. గతంలో ఈ చిత్రానికి తంగం, రాణా వంటి పేరు వినిపించాయి.

Rajinikanth: 'తలైవా 171' టైటిల్‌ ఏంటో తెలుసా? 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth)- దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (lokesh Kanagaraj)కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న 171వ చిత్రమిది. ఈ చిత్రానికి 'కూలీ’ (Coolie) అనే టైటిల్‌ ఖరారు చేశారు. గతంలో ఈ చిత్రానికి తంగం, రాణా వంటి పేరు వినిపించాయి. వాటికి భిన్నంగా కూలీ టైటిల్‌ పెట్టారు. ఈ మేరకు టైటిల్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ చూస్తుంటే పూర్తిగా యాక్షన్  ప్యాక్డ్‌ సినిమాలాగా అనిపిస్తోంది. రజనీకాంత్  యాక్షన్, డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Sreeleela: అతని పక్కన అవకాశం అంటే మామూలు విషయం కాదు!


Coolie.jpg

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ లియో చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్‌.. రజనీకాంత్‌తో సినిమాని ప్రకటించడంతో కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరూ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ‘‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ఇందులో రజనీకాంత్‌ పాత్ర ఇంతకుముందు చూడని విధంగా కనిపిస్తారని, కాస్త నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో ఆయన కనిపించే అవకాశం ఉందని తెలిపారు. సనపిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది. 

Updated Date - Apr 22 , 2024 | 08:21 PM