తాన్య రవిచంద్రన్‌ ప్రధాన పాత్రలో.. ‘రెక్కై ములైత్తేన్‌’

ABN , Publish Date - Jul 08 , 2024 | 02:15 PM

యువ హీరోయిన్‌ తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రెక్కై ములైత్తేన్‌. ఈ సినిమా తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

tanya

యువ హీరోయిన్‌ తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రెక్కై ములైత్తేన్‌’(Rekkai Mulaithen). ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభాకరన్ (SR Prabhakaran) నిర్మించగా, ఈ సినిమా తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు ‘యూఏ’ సర్టిఫికేట్‌ను మంజూరు చేస్తూ, యువతకు మంచి సందేశం ఇచ్చే చిత్రమంటూ సినిమా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

స్టోన్‌ ఎలిఫెంట్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను ఎస్‌ఆర్‌ ప్రభాకరన్‌ (SR Prabhakaran) సమకూర్చి తొలిసారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ..‘ఇది పూర్తిగా కాలేజీ యువత నేపథ్యంలో సాగుతుంది. సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు సైతం ఎంతగానో మెచ్చుకున్నారు.


FtsMIHSWYA4akbe.jpeg

నేను సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి, నిర్మించిన తొలి చిత్రం కావడంతో దర్శకత్వం వహించాను. తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran) ప్రధాన పాత్రను పోషించగా, ఇతర పాత్రల్లో జయప్రకాష్‌, నరేష్‌, గజరాజ్‌, జీవారవి, మీరాకృష్ణన్‌లు నటించారు. మరో ఐదుగురు కొత్త నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నారు. నేపథ్య సంగీతం తరణ్‌ కుమార్‌ సమకూర్చగా, పాటలకు దీసన్‌ సంగీతం అందించారు. ఈ సినిమాలోని తొలి సింగిల్‌ను త్వరలోనే విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 02:15 PM