Yogi Babu: యోగిబాబు కోరిక తీరేనా..

ABN, Publish Date - Dec 18 , 2024 | 09:28 AM

నేను చదువుకున్నది ప్రభుత్వ పాఠశాల. నాకో డ్రీమ్ ఉంది. అది తీర్చాలని దర్శకనిర్మాతలను కోరుతున్నానని అన్నారు నటుడు యోగిబాబు. ఇంతకీ ఆయన డ్రీమ్ ఏంటో తెలుసా..

Yogi Babu

తాను చదివిన పాఠశాలపై ఒక సినిమా తీయాలని కొన్నేళ్ళుగా ప్రయత్నం చేస్తున్నానని కానీ ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదని,. అలాగే తను స్కూల్‌ లైఫ్‌ కూడా ఎవరైనా సినిమాగా తీయొచ్చని కమెడియన్‌, హీరో యోగిబాబు అన్నారు. క్వాంటమ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఆర్‌కే విద్యాధరన్‌ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కూల్‌’. ఇళయరాజా సంగీతం అందించారు. భూమికా చావ్లా, యోగిబాబు, కేఎస్‌ రవికుమార్‌ ప్రధాన పాత్రలు పోషించగా.. నిళల్‌గల్‌ రవి, బక్స్‌ శ్యామ్స్‌, ప్రియాంక వెంకటేష్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నై నగరంలో చిత్ర బృందం విడుదల చేసింది.

Also Read-Allu Arjun: అల్లు అర్జున్‌‌‌ బెయిల్ రద్దు? పోలీసుల షాకింగ్ డెసిషన్..

ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత ఆర్‌కే విద్యాధరన్‌ మాట్లాడుతూ.. కళాకారుడికి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రం లభిస్తే, అతనిలో సరికొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఉద్దేశంతోనే క్వాంటమ్‌ ప్రొడక్షన్‌ స్థాపించాను. ఈ కథలో ఎవరిని నటుడిగా ఎంపికచేయాలని ఆలోచన చేస్తుండగా ప్రతి ఒక్కరూ యోగిబాబు పేరు చెప్పారు. ఈ సినిమాలో యోగిబాబు, భూమికా చావ్లా ఉపాధ్యాయులుగా నటించారు. నా గురువు కేఎస్‌ రవికుమార్‌ మరో కీలక పాత్ర పోషించారు. ఒక మంచి కథని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.


నటుడు యోగిబాబు మాట్లాడుతూ.. నేను చదువుకున్నది ప్రభుత్వ పాఠశాల. ఈ స్కూల్‌ కథను ఒక సినిమాగా తీయాలని కొన్నేళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. నా స్కూల్‌ జీవితాన్ని కూడా సినిమా తీయాలని కోరుతున్నా. ఈ సినిమాకు ఇళయరాజా అద్భుతమైన సంగీత స్వరాలు సమకూర్చారు. సినిమా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

Also Read-Malaika Arora: ‘ఇన్నర్ SRK’ని దింపిన మలైకా.. ఐకానిక్ రైలు సీన్‌తో రీల్

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 18 , 2024 | 09:28 AM