Vijay Antony: క్షమాపణలు చెప్పిన విజయ్‌ ఆంటోని!

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:16 PM

సంగీత దర్శకుడు, డైరెక్టర్‌, సినీ హీరో విజయ్‌ ఆంటోని క్రైస్తవ మతపెద్దలకు క్షమాపణలు చెప్పారు. ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యేసుక్రీస్తు గురించి తప్పుగా వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలను తమిళనాడు క్రైస్తవ సమాఖ్య తీవ్రంగా ఖండించింది. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే విజయ్‌ ఆంటోని ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరింది. దీంతో విజయ్‌ ఆంటోని క్షమాపణలు కోరుతూ సుధీర్ఘ ప్రకటనను విడుదల చేశారు.

Vijay Antony: క్షమాపణలు చెప్పిన విజయ్‌ ఆంటోని!
Vijay Antony

సంగీత దర్శకుడు, డైరెక్టర్‌, సినీ హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) క్రైస్తవ మతపెద్దలకు క్షమాపణలు చెప్పారు. ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడినట్టు ప్రచారం జరిగింది. ‘మద్యం సేవించే విషయంలో స్త్రీపురుషభేదాలు చూడరాదు. మద్యం సేవించడం అనేది అన్ని జాతుల్లో సర్వసాధారణమైన అంశం. పురాతన కాలంలో కూడా మద్యం ఉండేది. దాన్ని కాలానుగుణంగా పేరు మార్చుకుంటూ వచ్చారు. సారా అనే పేరుతో గతంలో సేవించేవాళ్లం. ఇపుడు బడా కంపెనీలు ఉత్పత్తి చేసి, వివిధ రకాలైన పేర్లతో విక్రయించే మద్యాన్ని తాగుతున్నాం. యేసుక్రీస్తు (Jesus Christ) కూడా ద్రాక్షరసం సేవించారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తమిళనాడు క్రైస్తవ సమాఖ్య తీవ్రంగా ఖండించింది. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే విజయ్‌ ఆంటోని ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరింది. దీంతో విజయ్‌ ఆంటోని సుధీర్ఘ ప్రకటన విడుదల చేశారు. (Vijay Antony’s Apology)


Vijay-antony.jpg

అందులో.. ‘‘ప్రియమైన క్రైస్తవ సోదరులారా... ద్రాక్ష రసం ఇప్పుడు కనిపెట్టలేదు. రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే వాడుకలో ఉంది. దేవాలయాలు, చర్చీల్లో వినియోగించారు. నేను ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలను తప్పుగా వక్రీకరించారు. ఈ విషయంలో మీ మనస్సులను నొప్పించి వుంటే క్షమాపణలు కోరుకుంటున్నా. మతాలకు అతీతంగా ప్రజల కోసం రక్తాన్ని చిందించి పరలోకానికి వెళ్లిన యేసును తప్పుగా చిత్రీకరిస్తానని కలలో కూడా ఊహించను’’ అని పేర్కొన్నారు. విజయ్ ఆంటోని క్షమాపణలు కోరడంతో.. ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగింది. (Vijay Antony Apologises over Jesus Christ Comment)


ఇవి కూడా చదవండి:

====================

*Kaliyugam Pattanamlo: ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదు.. ట్రెండింగ్‌లో ట్రైలర్

******************

*Niharika Konidela: ఆరోజు రాడిస‌న్ బ్లూ ప‌బ్‌లో ఏం జరిగిందంటే..

**************************

Updated Date - Mar 19 , 2024 | 03:16 PM