Parking: త‌మిళ సినిమాకు అరుదైన గుర్తింపు.. ఆస్కార్‌ లైబ్రరీలో స్థానం

ABN , Publish Date - May 27 , 2024 | 09:10 AM

హరీష్‌ కళ్యాణ్, ఎంఎస్‌ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘పార్కింగ్‌’. ఈ సినిమా స్క్రిప్టుకు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్ సైన్సెస్‌కు (Oscar's) చెందిన గ్రథాలయం (లైబ్రరీ)లో స్థానం లభించింది.

Parking: త‌మిళ సినిమాకు అరుదైన గుర్తింపు.. ఆస్కార్‌ లైబ్రరీలో స్థానం
parking

రామ్‌కుమార్‌ బాలకృష్ణన్ (Ramkumar Balakrishnan) దర్శకత్వంలో హరీష్‌ కళ్యాణ్ (Harish Kalyan), ఎంఎస్‌ భాస్కర్ (M. S. Bhaskar) ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘పార్కింగ్‌’(Parking). ఈ సినిమా స్క్రిప్టుకు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్ సైన్సెస్‌కు (Oscar's) చెందిన గ్రథాలయం (లైబ్రరీ)లో స్థానం లభించింది. ‘పర్మినెంట్‌ కోర్‌ కలెక్షన్‌’ కింద ఈ స్క్రిప్టు సేకరించి ఆస్కార్‌ లైబ్రరీలో భద్ర పరచనున్నారు. ఇదే విషయంపై ఆ చిత్ర హీరో హరీష్‌ కళ్యాణ్ (Harish Kalyan) ఓ ట్వీట్‌ చేశారు.

GOQR1c5WkAAH0k_.jpeg

‘పార్కింగ్‌’ (Parking) చిత్రం ప్రేక్షకుల హృదయాల నుంచి ఆస్కార్‌ లైబ్రరీకి చేరింది. ఒక మంచి కథ దానికి తగిన స్థానానికి అది వెళ్ళి చేరుతుంది. ఈ నమ్మశక్యంగాని తరుణంలో నా ‘పార్కింగ్‌’ బృందానికి హృదయ పూర్వక ధన్యవాదాలు, అభినందనలు’ తెలుపుకుంటున్నాను.

GOQBH3hWkAA33BU.jpeg


చిత్ర దర్శకుడు రామ్‌కుమార్‌ బాలకృష్ణన్ (Ramkumar Balakrishnan) చేసిన ట్వీట్‌లో ‘భారీ చిత్రాల నడుమ నా చిత్రానికి స్థానం దక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కాగా ఇందులో హరీష్‌ కళ్యాణ్ (Harish Kalyan) సరసన ఇందుజ (Indhuja Ravichandran) హీరోయిన్‌గా నటించగా సీఎస్‌ శ్యామ్‌ సంగీతం సమకూర్చారు. గత యేడాది డిసెంబరులో ఐదు భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది.

GCkR3H-bgAAWHaG.jpeg

Updated Date - May 27 , 2024 | 09:10 AM