Rail: వలస కార్మికుల జీవన చిత్రం ‘రైల్‌’

ABN , Publish Date - Jun 23 , 2024 | 10:00 PM

ఈశుక్ర‌వారం త‌మిళ‌నాట అర డ‌జ‌న్‌కు పైగా చిత్రాలు విడుద‌లయ్యాయి. వీటిలో సినిమా ప్రారంభం నుంచి ఎన్నో వివాదాలు చుట్టిముట్టిన రైల్ సినిమా కూడా ఈ వార‌మే ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చింది.

Rail: వలస కార్మికుల జీవన చిత్రం ‘రైల్‌’
rail

ఈశుక్ర‌వారం త‌మిళ‌నాట అర డ‌జ‌న్‌కు పైగా చిత్రాలు విడుద‌లయ్యాయి. వీటిలో సినిమా ప్రారంభం నుంచి ఎన్నో వివాదాలు చుట్టిముట్టిన రైల్ సినిమా కూడా ఈ వార‌మే ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చింది. ఉత్తరాది వలస కార్మికుల జీవన చిత్రాన్ని తెలిపే సినిమాగా దర్శకుడు భాస్కర్‌ శక్తి (Bhaskar Sakthi) ‘రైల్‌’(Rail) చిత్రాన్నిను తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో కుంకుమ్‌ రాజ్‌, పర్వేజ్‌ మెహ్రూ ప్రధాన పాత్రలను పోషించారు. ఇందులో పల్లెటూరి జీవితాన్ని, అక్కడి ప్రజల వాస్తవికతకు దగ్గరగా చూపించారు. ఉపాధి కోసం ఉత్తరాది నుంచి రాష్ట్రానికి వచ్చే వలస కార్మికులు, స్థానిక ప్రజల మనోభావాలపై అధిక దృష్టిని కేంద్రీకరించకుండా ఇతర అంశాలపై శ్రద్ధ చూపించి, కథను పక్కదారి పట్టించారు.

ఉత్తరాది కార్మికులను, ప్రజలను మంచివారిగా చిత్రీకరించాలనే దర్శకుడి ఆలోచన మెచ్చుకోదగినదే అయినప్పటికీ కార్మికుల భావోద్వేగాలను, స్థానిక ప్రజల ఆలోచనలను సమతూకంతో తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు, వారి మనోభావాలు, వలస మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, ప్రజల సమస్యలు, స్థానికులపై మద్యపానం ఏ విధంగా ప్రభావం చూపుతుందన్న అంశాలను దర్శకుడు వైవిధ్య భరితంగా చూపించారు.


rail-970cf7e0-2c75-11ef-823e-c1c5dc58e6ec.jpg

మద్యపానం వల్ల ఛిద్రమైన కుటుంబం, ఆర్థిక కష్టాలు, దుబాయ్‌ నుంచి స్వదేశానికి వచ్చిన వ్యక్తి ఇతరులను మోసం చేయడం, వలస కార్మికుల ఆందోళన, అనుకోని సమస్యలు, చట్టుపక్కల వాతావరణం, కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాలకు రెడ్‌ సిగ్నల్‌ లేకుండా సాగిపోవడం ప్రేక్షకుడికి బోర్‌ తెప్పించేవిగా ఉన్నాయి.

ఇందులో హీరో కుంకుమ్‌రాజ్‌ ‘ముత్తయ్య’ పాత్రలో జీవించగా, పొరుగింటిలో నివసించే వ్యక్తిగా, పర్వేజ్‌ మెహ్రూ పోటీపడి నటించారు. ఇతర పాత్రలను వైరమాల, రమేష్‌ వైద్య, షమీరా, వైరమ్‌ పట్టి, వందన పోషించారు. తేని ఈశ్వర్‌ కెమెరా పనితనం బాగుంది. నిర్మాత ఎం.వేడియప్పన్‌ నిర్మించిన ఈ చిత్రం అనేక సమస్యలను అధికమించి విడుదలై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

Updated Date - Jun 23 , 2024 | 10:00 PM