SuriyaJyothika: సూర్య, జ్యోతిక విడాకులు.. అస‌లు విష‌యం ఇదే!

ABN , Publish Date - Jan 31 , 2024 | 12:34 PM

ఏది వాస్త‌వ‌మో, ఏది అవాస్త‌వ‌మో అనేది తెల్సుకోవ‌డం నేడు పెద్ద స‌వాల్‌గా మారింది. తాజాగా సూర్య‌, జ్యోతిక విడాకులు తీసుకున్నారు, తీసుకుంటున్నారంటూ అదే ప‌నిగా వార్త‌లు సోష‌ల్‌మీడియాలో చక్క‌ర్లు కొట్టాయి.

SuriyaJyothika: సూర్య, జ్యోతిక విడాకులు.. అస‌లు విష‌యం ఇదే!
jyothika

క‌విత్వానికి కాదేది అన‌ర్హం అనేది ఓ నానుడి.. కానీ ఇప్పుడు పుకార్లు, రూమ‌ర్ల‌కు లేదేది అడ్డంకి అన్నచంద‌గా త‌యారైంది ప్ర‌స్తుత సోష‌ల్ మీడియా కాలం. ఏది వాస్త‌వ‌మో, ఏది అవాస్త‌వ‌మో అనేది తెల్సుకోవ‌డం నేడు పెద్ద స‌వాల్‌గా మారింది. తాజాగా సూర్య (Suriya), జ్యోతిక (Jyothika) అంశంలోనూ ఇదే విష‌యం తేట‌ తెల్ల‌మైంది. విష‌యానికి వ‌స్తే సూర్య‌(Suriya), జ్యోతిక (Jyothika) విడాకులు తీసుకున్నారు, తీసుకుంటున్నారంటూ అదే ప‌నిగా వార్త‌లు సోష‌ల్‌మీడియాలో చక్క‌ర్లు కొట్టాయి. అదే స‌మ‌యంలో జ్యోతిక పిల‌ల్ల‌తో క‌లిసి ముంబైకి మ‌కాం మార్చ‌డంతో విడాకుల‌ వార్త‌లకు అజ్వం పోసిన‌ట్టైంది.

అదీగాక పిల్లలతో సహా జ్యోతిక ముంబైకి వెళ్లిపోవడంతో సూర్య(Suriya)తో జ్యోతిక (Jyothika) విడాకులు తీసుకుంటుందనే అందరు భావించారు. అదేవిధంగా జ‌న‌వ‌రి1న సూర్య ఒక్కడే అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం, అటు సూర్య కానీ ఇటు జ్యోతిక ఇంత‌వ‌ర‌కు ఎవరూ ఖండించక పోవడంతో ఈ వార్తలు నిజమేన‌ని అనుకుంటూ అభిమానులు తీవ్ర‌ నిరాశలో కురుకుపోయారు.


అయితే తాజాగా జ్యోతిక (Jyothika) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోతో ఈ వార్త‌న్నింటికి చెక్ పెట్టింది. ఇటీవల సూర్య-జ్యోతిక దంపతులు ఫిన్లాండ్‌కు విహార‌యాత్ర‌కు వెళ్ల‌గా ఆ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ‘2024 – (A year full of travel-ప్రయాణంతో నిండిన సంవత్సరం)’ అనే క్యాప్షన్‌ పెట్టి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సూర్య‌ జ్యోతిక త‌మ పిల‌ల్ల‌తో క‌లిసి ఎంజాయ్ చేసిన‌ట్టుగా అర్థ‌మ‌వుతుండ‌డంతో వారిమ‌ధ్య ఎలాంటి విభేధాలు లేవ‌ని వారు క‌లిసే ఉన్నార‌ని బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసొచ్చింది

అంతేకాక‌కుండా జ్యోతిక (Jyothika) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తుండ‌గా ఈక్ర‌మంలోనే బాలీవుడ్ నుంచి సైతం అవ‌కాశాలు త‌లుపు త‌డుతున్నాయి. పైపెచ్చు పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల నిమిత్తం ముంబైకి మ‌కాం మార్చింది. దీంతో సూర్య (Suriya) కూడా ముంబైలోనే ఉంటూ సినిమా షూటింగ్‌ల కోసం చెన్నైకి రాక‌పోక‌లు సాగిస్తున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా జ్యోతిక (Jyothika) అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హార్ర‌ర్‌,థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం ‘షైతాన్’ లో కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా మ‌రో రెండు చిత్రాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

Updated Date - Jan 31 , 2024 | 12:39 PM