Ashok Selvan: నా చిత్రంలో కథే హీరో

ABN , Publish Date - May 19 , 2024 | 12:59 PM

తాను నటించే చిత్రంలో కథే హీరో అని కథానాయకుడు అశోక్‌ సెల్వన్‌ అన్నారు. డెబ్యూ డైరెక్టర్‌ బాలాజీ కేశవన్‌ దర్శకత్వంలో అశోక్‌ సెల్వన్‌, అవంతికా మిశ్రా జంటగా ప్రేమ, హాస్యభరిత చిత్రంగా ‘ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌’ తెరకెక్కింది. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. టి. క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత తిరుమలై ఈ సినిమాను నిర్మించారు.

Ashok Selvan: నా చిత్రంలో కథే హీరో
Emakku Thozhil Romance Movie Still

తాను నటించే చిత్రంలో కథే హీరో అని కథానాయకుడు అశోక్‌ సెల్వన్‌ (Ashok Selvan) అన్నారు. డెబ్యూ డైరెక్టర్‌ బాలాజీ కేశవన్‌ (Balaji Kesavan) దర్శకత్వంలో అశోక్‌ సెల్వన్‌, అవంతికా మిశ్రా (Avantika Mishra) జంటగా ప్రేమ, హాస్యభరిత చిత్రంగా ‘ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌’ (Emakku Thozhil Romance) తెరకెక్కింది. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. టి. క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత తిరుమలై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ఇప్పటికే ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన రాగా, తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

రొమాన్స్‌లో మునిగి తేలే ఒక యువకుడు, తద్వారా ఎదురయ్యే సమస్యలు, అతనికి సాయపడే ఫ్యామిలీ, స్నేహితులు ఇలా అన్ని అంశాలతో హాస్యభరిత ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో అశోక్‌ సెల్వన్‌ ఒక ప్లేబాయ్‌ పాత్రను పోషించారు. సీనియర్‌ నటి ఊర్వశి ఓ ముఖ్య పాత్రలో నటించారు. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (Emakku Thozhil Romance Trailer Released)


Ashok.jpg

ఈ సినిమా గురించి హీరో అశోక్‌ సెల్వన్‌ (Hero Ashok Selvan) మాట్లాడుతూ... గత చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుంది. నా చిత్రాల్లో కథే హీరో. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలు నిరాశపరిచిన సందర్భాలు లేవు. ఈ సినిమా కూడా మంచి కథాంశంతో రూపుదిద్దుకుంది. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని వెల్లడించారు.

Updated Date - May 19 , 2024 | 12:59 PM