Raayan: రెహ‌మాన్ సంగీతం, ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం.. సందీప్ కిష‌న్, ఆప‌ర్ణ‌పై రొమాంటిక్ సాంగ్‌

ABN , Publish Date - May 26 , 2024 | 09:43 AM

ధ‌నుష్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాయన్‌’. సందీప్‌ కిషన్ , ఎస్‌జే సూర్య,అపర్ణ బాలమురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సందీప్ కిషన్, అపర్ణ బాలమురళిల‌పై చిత్రీక‌రించిన‌ ఓ రొమాంటిక్ మెలోడీని విడుద‌ల చేశారు.

Raayan: రెహ‌మాన్ సంగీతం, ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం.. సందీప్ కిష‌న్, ఆప‌ర్ణ‌పై రొమాంటిక్ సాంగ్‌
raayan

కెప్టెన్ మిల్ల‌ర్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత జాతీయ‌ అవార్డ్ గ్ర‌హీత ధ‌నుష్ (Dhanush) కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాయన్‌’ (Raayan). ధనుష్ ల్యాండ్‌మార్క్ 50వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్ Sundeep Kishan), ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్‌, అపర్ణ బాలమురళి, కాళిదాస్ (kalidas jayaram) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Raayan

స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహ‌మాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్ సింగిల్ మాస్ ట్రీట్ అందించ‌గా ఇప్పుడు సందీప్ కిషన్, అపర్ణ బాలమురళిల‌పై చిత్రీక‌రించిన‌ ఓ రొమాంటిక్ మెలోడిని విడుద‌ల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్ ప్రకాష్, హరిప్రియలు ఈ పాట‌ను పాడ‌గా పాడారు.

Raayan


జూన్ 13న ఈ రాయన్ (Raayan) చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేస్తోంది. కాగా ఈ సినిమాను పాన్ ఇండియాగా త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

Updated Date - May 26 , 2024 | 09:43 AM