Raghava Lawrence : వెట్రిమారన్‌ నిర్మాత.. లారెన్స్ హీరో! కాంబినేష‌న్ అదిరింది

ABN , Publish Date - Apr 24 , 2024 | 08:10 AM

జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ నిర్మాతగా దర్శకనటుడు రాఘవ లారెన్స్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనుంది.

Raghava Lawrence : వెట్రిమారన్‌ నిర్మాత.. లారెన్స్ హీరో! కాంబినేష‌న్ అదిరింది
lawrence

జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ (Vetri Maaran) నిర్మాతగా దర్శకనటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా ఒక చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, ఫైవ్‌స్టార్‌ కదిరేశన్ (S Kathiresan) భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవ‌లే అధికారికంగా ప్రకటించారు. 2002లో ‘పార్తాలే పరవశం’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన లారెన్స్‌.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మార్కెట్‌ సొంతం చేసుకున్నారు.

raghava.jpeg

ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్‌ అవుతూ బీజీగా ఉన్న లారెన్స్ (Raghava Lawrence) తాజాగా యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ నిర్మాణంలో భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ‘బెల్స్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నిర్మాతగా లోకేష్‌ కనకరాజ్‌కు ఇది రెండో చిత్రం. అలాగే, లారెన్స్‌ తన 25వ చిత్రం ‘హంటర్‌’ను కూడా ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి వెంకట్‌ మోహన్‌ దర్శకుడు కాగా, దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.


ఇదిలాఉండగా.. నూతన దర్శకుడు దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘అధికారం’ పేరుతో ఒక చిత్రాన్ని రెండేళ్ళ క్రితం ప్రారంభించి, మధ్యలోనే విడిచిపెట్టారు. ఇపుడు ఈ చిత్రాన్ని మళ్ళీ పట్టాలపైకి ఎక్కించనున్నారు. దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) కథ సమకూర్చనున్నారు. ఫైవ్‌స్టార్‌ కదిరేశన్ (S Kathiresan), వెట్రిమారన్‌ కలిసి ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తన ట్విటర్‌ హ్యాండిల్‌లో అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఇటు సినిమా వర్గాలోనే కాకుండా, అటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగిపోయాయి.

Updated Date - Apr 24 , 2024 | 08:10 AM