మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Nayanthara: భర్త విఘ్నేష్ శివన్ ని అన్ ఫాలో చేసిన నయనతార, వార్త వైరల్

ABN , Publish Date - Mar 02 , 2024 | 02:21 PM

అగ్రనటీమణి నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ ని ఇన్‌స్టాగ్రామ్ లో అన్ ఫాలో అయ్యారు అనే వార్త వైరల్ అయింది. దానిపై రకరకాలుగా అభిమానులు అభిప్రాయాలు చెపుతున్నా, మళ్ళీ ఆమె తన భర్తని ఫాలో అవటం ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో చూపిస్తోంది. అంటే ఎదో సాంకేతికలోపం వచ్చి ఉండొచ్చు అని కూడా అంటున్నారు.

Nayanthara: భర్త విఘ్నేష్ శివన్ ని అన్ ఫాలో చేసిన నయనతార, వార్త వైరల్
Nayanthara and Vignesh Shivan

దక్షిణాదిన అగ్రనటీమణుల్లో వెలుగొందుతున్న నయనతార సామాజిక మాధ్యమాల్లో ఈమధ్యనే ఆరంగేట్రం చేశారు. ఆమె తన కవల పిల్లల ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో మొదటి పోస్టుగా పెట్టి జాయిన్ అయ్యారు. ఆ తరువాత ఆమెకి వందల, వేల, లక్షల మంది అభిమానులు ఫాలో అవటం మొదలెట్టారు. ఈరోజు ఆమెకి ఇన్‌స్టాగ్రామ్ లో 78 లక్షల మంది ఫాలోవర్స్ (7.8 మిలియన్) వున్నారు. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ తో చాలా కాలం పాటు ప్రేమలో వుండి జూన్ 9, 2022 న వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 9, 2022 ఈ జంట తమ కవల పిల్లల్ని ఆహ్వానిస్తూ పోస్ట్ పెట్టారు. వారు సర్రోగసి ద్వారా ఈ పిల్లల్ని కన్నారు. (Nayanthara unfollows her husband on Instagram and later following)

nayantharawithhertwins.jpg

ఇప్పుడు నయనతార వార్తల్లో వున్నారు. ఎందుకంటే ఆమె తన భర్త విఘ్నేష్ శివన్ ని ఇన్‌స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశారు. ఎందుకు అలా చేశారో ఎవరికీ తెలియదు కానీ నయనతార అభిమానులు మాత్రం ఈ విషయంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అదేదో పొరపాటున ఆలా అయింది అని అదేమంత పెద్ద విషయం కాదని ఇలా అనుకుంటున్నారు. కొందరైతే సాంకేతిక కారణాలు ఉండొచ్చు అని కూడా అంటున్నారు. (Nayanthara unfollows her husband Vignesh Shivan in Instagram) ఇలా ఎవరికీ వారు అనుకుంటున్నా, నయనతార ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం ఆమె తన భర్తని ఫాలో అవుతున్నట్టు మళ్ళీ చూపిస్తోంది. ఏదైనా సాంకేంతిక లోపం వలన కొన్ని గంటలపాటు అన్ ఫాలో అయినట్టు కనిపించక పోవచ్చు అని కూడా అంటున్నారు.

nayantharavigneshshivan.jpg

పని పరంగా చూస్తే నయనతార ఈమధ్యనే షారుఖ్ ఖాన్ తో నటించిన హిందీ సినిమా 'జవాన్' చాలా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు 'టెస్ట్' అనే సినిమాలో నటిస్తున్నారు, ఇందులో మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. శశికాంత్ ఈ సినిమాకి దర్శకుడు.

Updated Date - Mar 02 , 2024 | 03:30 PM