Love Insurance Kompany: ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల

ABN, Publish Date - Jul 27 , 2024 | 09:12 PM

హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయన హీరోగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (ఎల్‌ఐకే) ఫస్ట్‌లుక్‌, ఎస్.జె. సూర్య లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఈ రెండు లుక్స్.. ఇంట్రెస్టింగ్‌గా ఉండటమే కాకుండా.. సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. 7 స్ర్కీన్‌ స్టూడియో బ్యానర్‌పై లలిత్‌ కుమార్‌ రౌడీ పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Love Insurance Kompany: ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల
Love Insurance Kompany Movie Still

హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయన హీరోగా విఘ్నేష్‌ శివన్‌ (Vignesh Shivan) దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (ఎల్‌ఐకే) ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ పరిశీలిస్తే లవ్‌, బ్రేకప్‌ వంటి అంశాలతో రూపొందించినట్టుగా కనిపిస్తుంది. దీనిని ధ్రువీకరించేలా పోస్టర్‌లోని ఓ భవనంపై ‘బ్రేకప్‌ క్లెయిమ్‌ పెనాల్టీ’ అని రాసివుంది. ప్రదీప్‌ రంగనాథన్‌ ఫోన్‌ టచ్‌ చేస్తున్నట్లుగా ఉన్న లుక్‌ అందరిని ఆకర్షిస్తోంది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఒక్క సినిమా మినహా మిగిలిన చిత్రాలన్నీ ప్రేమ నేపథ్యంలో తెరకెక్కినవే. ఈ సినిమా కూడా ఆ బాణీలోనే రూపొందిస్తున్నారు. (Love Insurance Kompany First Look)

Also Read- K Vijaya Bhaskar: మరో ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా ఇది..

7 స్ర్కీన్‌ స్టూడియో బ్యానర్‌పై లలిత్‌ కుమార్‌ రౌడీ పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఎస్‌జే సూర్య, సీమాన్‌, కృతిశెట్టి, యోగిబాబు, ఆనంద్‌ రాజ్‌, మాళవిక, సునీల్‌ రెడ్డి తదితరులు నటించారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ, అనిరుధ్‌ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను నేటి యూత్ ప్రేమకథగా పూర్తిస్థాయి హాస్యభరితంగా నిర్మిస్తున్నారు. ఇదిలా వుండగా గతంలో ఈ చిత్రం పేరును ‘ఎల్‌ఐసీ’గా ఖరారు చేయగా, జీవిత బీమా సంస్థ నుంచి అభ్యంతరం రావడంతో ఆ పేరును ఎల్‌ఐకే (‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’)గా మార్చారు.


Lik-Look.jpg

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ యమా జోరుగా మొదలెట్టారు. ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న ఎస్.జె. సూర్య (SJ Suryah) లుక్‌ని కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఈ లుక్‌ చూస్తుంటే.. ఎస్.జె. సూర్య కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్రలో నటించినట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్, ఎస్.జె. సూర్య లుక్‌తో ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ ట్యాగ్ వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 27 , 2024 | 10:09 PM