Nayanatara: ‘M.S సుబ్బులక్ష్మి’గా నయనతార?

ABN , Publish Date - May 27 , 2024 | 08:39 AM

ఇటీవల ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకుని బయోగ్రఫీ సినిమాలుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత విద్యాంసురాలు, గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై దృశ్య కావ్యంగా రూపుదిద్దుకోనుంది.

Nayanatara: ‘M.S సుబ్బులక్ష్మి’గా నయనతార?
nayanatara

ఇటీవల కాలంలో ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకుని బయోగ్రఫీ సినిమాలుగా వస్తున్నాయి. అలా వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులను మెప్పించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత విద్యాంసురాలు, గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి (M. S. Subbulakshmi) జీవిత చరిత్ర వెండితెరపై దృశ్య కావ్యంగా రూపుదిద్దుకోనుంది.

mss.jpeg

నిజానికి కొంతకాలం క్రితం ఈ బయోగ్రఫీ గురించి వార్త ఒకటి వచ్చింది. బాలీవుడ్‌ నటి విద్యా బాలన్ (Vidya Balan) ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే, ఇపుడు ఆ పాత్రలో నయనతార (Nayanatara) నటించనున్నట్టు తెలుస్తుంది.


Nayana.jpg

ఈ ప్రాజెక్టు చేపట్టే బెంగుళూరుకు చెందిన నిర్మాణ కంపెనీ ప్రధాన పాత్రలకు సరిపోయేలా నయనతార, రష్మిక మందన్నా (Rashmika Mandanna), త్రిష (Trisha Krishnan) తదితరుల పేర్లను పరిశీలిస్తుంది. తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో తెరకెక్కించే ఈ చిత్రంలో నయనతార (Nayanatara)ను ఎంపిక చేసేందుకు మొగ్గు చూపినట్టు సమాచారం.

Updated Date - May 27 , 2024 | 08:39 AM