Karunakaran: నాలో చిన్న అసంతృప్తి ఉంది
ABN, Publish Date - Dec 28 , 2024 | 10:16 PM
షార్ట్‌ఫిల్మ్‌లో తొలిసారి కనిపించి.. ఆ తర్వాత దర్శకుడు సుందర్ తొలిసారి సినిమా అవకాశం ఇచ్చినప్పటికీ 2012లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘పిజ్జా’లో విజయ్ సేతుపతి స్నేహితుడిగా నటించారు నటుడు కరుణాకరన్. ఆయన తాజాగా నాలో చిన్న అసంతృప్తి ఉందంటూ చెప్పుకొచ్చారు. అదేంటంటే..
తనకు ప్రతినాయకుడిగా నటించాలని ఉందని ప్రముఖ నటుడు కరుణాకరన్ అంటున్నారు. ఆయన నటించిన రెండు చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. వీటిలో ఒకటి సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘మిస్ యూ’ కాగా, రెండోది మిర్చి శివ హీరోగా నటించిన ‘సూదు కవ్వుం-2’. ఆ రెండు సినిమాల్లో కరుణాకరన్ కీలక పాత్రలు పోషించి మరోమారు ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా ‘మిస్ యూ’ సినిమాలో తన సహజసిద్ధమైన నటన ప్రదర్శించి మరో అడుగు ముందుకేశారు. ఈ సినిమాలో కంటే ‘సూదు కవ్వుం-2’లో మరింత మెరుగైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇందులో మంత్రిగా నటించిన కరుణాకరన్.. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారంటూ ప్రశంసిస్తున్నారు.
Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనిట్‌కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్
తన స్నేహితుడు, దర్శకుడు నలన్ కుమారస్వామి ద్వారా షార్ట్‌ఫిల్మ్‌లో తొలిసారి కనిపించారు. ఆ తర్వాత దర్శకుడు సుందర్ తొలిసారి సినిమా అవకాశం ఇచ్చినప్పటికీ 2012లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘పిజ్జా’లో విజయ్ సేతుపతి స్నేహితుడిగా కరుణాకరన్ నటించారు. ఇది ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో తనకుంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన విడుదలైన ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో కరుణాకరన్ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘ఇప్పటివరకు అన్ని రకాల పాత్రలు పోషించాను. వీటిలో ఎన్నో మంచి పాత్రలు ఉన్నాయి. కమెడియన్‌గా కూడా కొత్తగా నన్ను నేను నిరూపించుకోవాల్సింది ప్రత్యేకించి ఏమీలేదు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు హార్డ్‌వర్క్ చేస్తూనే ఉన్నాను. అయితే, నాలో చిన్న అసంతృప్తి ఉంది. ప్రతినాయకుడిగా నటించాలని ఉంది. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. విలన్‌గా అవకాశం వస్తే మాత్రం వదులుకోను. ఒక్క చిత్రంలోనైనా విలన్‌గా నటించి నన్ను నేను నిరూపించుకోవాలని వుంది’ అన్నారు.