క‌మ‌ల్‌హ‌స‌న్‌ 'థ‌గ్ లైఫ్'.. సినిమాలోకి కొత్త‌గా మ‌రో ఇద్ద‌రు స్టార్స్‌! అస‌లేం ఫ్లాన్ చేస్తున్నారు స‌ర్‌

ABN , Publish Date - Jan 10 , 2024 | 07:54 PM

కమల్ హసన్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కలయికలో వస్తున్న కొత్త చిత్రం థ‌గ్ లైఫ్‌.ఇప్ప‌టికే ఇందులో జయం రవి, దుల్హర్ సల్మాన్, త్రిష న‌టిస్తుండ‌గా తాజాగా మ‌రో ఇద్ద‌రు స్టార్స్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు.

క‌మ‌ల్‌హ‌స‌న్‌ 'థ‌గ్ లైఫ్'.. సినిమాలోకి కొత్త‌గా మ‌రో ఇద్ద‌రు స్టార్స్‌! అస‌లేం ఫ్లాన్ చేస్తున్నారు స‌ర్‌
kamal hasan

విశ్వ‌ నాయకుడు కమల్ హసన్ (Kamal Hasan), మణిరత్నం (Maniratnam) , ఏఆర్ రెహమాన్ (AR Rahman) కలయికలో (KH234) వస్తున్న కొత్త చిత్రం థ‌గ్ లైఫ్‌. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్‌7న కమల్ జన్మదినం సందర్భంగా ప్రారంభించి సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 36 సంవత్సరాల తర్వాత కమల్ హసన్, మణిరత్నం కలయికలో నాయకన్ (Nayakan) వంటి కల్ట్ క్లాసిక్ త‌ర్వాత‌ రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై దేశమంతటా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ఇప్ప‌టికే తమిళ స్టార్ జయం రవి (Jayam Ravi), పాన్ ఇండియా స్టార్ దుల్హర్ సల్మాన్ (Dulquer Salmaan) , త్రిష (Trisha) వంటి స్టార్ క్యాస్ట్ న‌టిస్తుండ‌డంతో పాటు జాతీయ ఆవార్డు టెక్నీషియన్స్ చాలా మంది ఈ సినిమాకు పని చేస్తుండ‌గా తాజాగా ఈ సినిమాలో త‌మిళ న‌టుడు గౌత‌మ్ కార్తీక్ (Gautham Karthik), మ‌ళ‌యాళ న‌టుడు జోజు జార్జ్ (Joju George) వంటి మ‌రో ఇద్ద‌రు కొత్త స్టార్స్ న‌టిస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఈ రోజు (బుధ‌వారం) అధాక‌రికంగా ప్ర‌క‌టించారు ఈ సందర్బంగా వారికి ఆహ్వనం పలుకుతూ మేకర్స్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకు చెందిన వార్తలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.


ఈ సినిమాలో కమల్ హాసన్ పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్ (Rangaraya Sakthivel Nayakar) కాగా సినిమాలో దొంగ, క్రిమినల్ గా కనపడనున్నారని ఈ చిత్రం టీజ‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది. అయితే ఇది గ‌తంలో వ‌చ్చిన నాయ‌కుడు చిత్రానికి సీక్వెల్ అని నెట్టింట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఎందుకంటే 'నాయకుడు' సినిమాలోనూ కమల్ హాసన్ పేరు శక్తివేల్ నాయకర్ (Sakthivel Naicker) కావ‌డంతో ఈ సినిమాకు దానికి ఏమైనా లింక్‌ ఉండే అవ‌కాశం ఉండొచ్చ‌ని నెటిజ‌న్స్‌ అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా టీజ‌ర్‌లో చూయించిన 80 శాతం విజువ‌ల్స్‌ హాలీవుడ్ సినిమా 'రైజ్ అఫ్ స్కై వాకర్' (Rise of Skywalker) ను పోలి ఉండ‌డంతో ఈ సినిమాను కాఫీ చేస్తున్నార‌నే రూమ‌ర్స్‌గా గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 10 , 2024 | 07:54 PM