Arjun Das: ఆయనతో మళ్లీ మళ్లీ నటించాలని ఉంది

ABN , Publish Date - Feb 28 , 2024 | 09:49 AM

మలయాళ దర్శకుడు బిజోయ్‌ నంబియార్‌ రూపొందించిన ‘పోర్‌’ సినిమా కాలేజీ లైఫ్‌ ఆధారంగా చేసుకుని తెరకెక్కిందని ఆ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన నటుడు అర్జున్‌దాస్ చెప్పారు. ‘సైతాన్‌’, ‘డేవిడ్‌’, ‘వాషీర్‌’, ‘షోలో’ వంటి అనేక చిత్రాలను తెరకెక్కించిన బిజోయ్‌ నంబియార్‌... తాజాగా తమిళం, హిందీ భాషల్లో అర్జున్‌ దాస్‌, కాళిదాస్‌ జయరాం ప్రధాన పాత్రధారులుగా చేసుకుని ‘పోర్‌’ మూవీని తెరకెక్కించారు.

Arjun Das: ఆయనతో మళ్లీ మళ్లీ నటించాలని ఉంది
Arjun Das

మలయాళ దర్శకుడు బిజోయ్‌ నంబియార్‌ రూపొందించిన ‘పోర్‌’ (Por) సినిమా కాలేజీ లైఫ్‌ ఆధారంగా చేసుకుని తెరకెక్కిందని ఆ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన నటుడు అర్జున్‌దాస్ (Arjun Das) చెప్పారు. ‘సైతాన్‌’, ‘డేవిడ్‌’, ‘వాషీర్‌’, ‘షోలో’ వంటి అనేక చిత్రాలను తెరకెక్కించిన బిజోయ్‌ నంబియార్‌ (Bejoy Nambiar)... తాజాగా తమిళం, హిందీ భాషల్లో అర్జున్‌ దాస్‌, కాళిదాస్‌ జయరాం ప్రధాన పాత్రధారులుగా చేసుకుని ‘పోర్‌’ మూవీని తెరకెక్కించారు. ఇతర పాత్రల్లో డీజే భాను, సంజనా నటరాజన్‌, మెర్విన్‌ రోసారియో వంటి పలువురు నటించారు. ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో విడుదల చేశారు. టి సిరీస్‌, రూక్స్‌ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. (Por Movie Audio and Trailer Launch)

ఆడియో రిలీజ్‌ వేడుకలో అర్జున్‌దాస్ మాట్లాడుతూ... ‘ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు. ఓ హోటల్‌లో స్టోరీ వినిపించారు. అప్పటికే కాళిదాస్‌ సెలెక్ట్‌ అయ్యారు. షూటింగ్‌ సమయంలో దర్శకుడు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సాధారణంగా రెండు భాషల్లో ఒక చిత్రాన్ని తెరకెక్కించేటపుడు ఇంకో భాషలో చిత్రీకరించిన ఫుటేజీని ఏ దర్శకుడు చూపించరు. కానీ, బిజోయ్‌ మరో భాషలో షూట్‌ చేసిన ఫుటేజీ చూపించి సహజంగా నటించమని సలహా ఇచ్చారు. ఈ సినిమా కాలేజీ లైఫ్‌ ఆధారంగా తెరకెక్కింది. ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్‌ చేసేలా ఉంటటుంది. స్నేహంతో పాటు పలు అంశాలు కూడా ఉన్నాయి. కాళిదాస్‌ జయరాంతో మళ్లీ నటించాలని ఉంది. మరో షూటింగ్‌ ఉండటంతో కాళిదాస్‌ ఇక్కడికి రాలేకపోయారు’ అని అన్నారు. (Por Movie Ready to Release)


Arjun-das.jpg

దర్శకుడు బిజోయ్‌ మాట్లాడుతూ.. తమిళంలో స్ర్టైట్‌ సినిమా తీసేందుకు నేను చేసిన మూడో ప్రయత్నమే ఈ ‘పోర్‌’. ‘షోలో’ చిత్రాన్ని కూడా ఆ లక్ష్యంతోనే తీశా. కానీ ఆ సినిమాను థియేటర్‌లో రిలీజ్‌ చేయలేకపోయా. ఇది ఫుల్‌లెంగ్త్‌ తమిళ చిత్రం. తమిళ వెర్షన్‌ ఎంతో బాగా వచ్చిందని అన్నారు. ఆ తర్వాత హీరోయిన్లు సంజనా నటరాజన్‌, డీజే భాను, నిర్మాత మధు అలెక్స్‌ తదితరులు ప్రసంగించారు. మార్చి 1న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 09:49 AM