భ‌లే కాంబినేష‌న్‌.. సంతానం సరసన మీనాక్షి చౌదరి?

ABN , Publish Date - Jun 23 , 2024 | 10:11 PM

హాస్య నటుడు సంతానం హీరోగా నటించే కొత్త చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. లొల్లుసభ ఫేం రాంబాలా దర్శకత్వం వహిస్తున్నారు.

భ‌లే కాంబినేష‌న్‌.. సంతానం సరసన మీనాక్షి చౌదరి?
santhanam

హాస్య నటుడు సంతానం (Santhanam) హీరోగా నటించే కొత్త చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) నటించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. లొల్లుసభ ఫేం రాంబాలా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి హాస్యభరిత చిత్రంగా తెరకెక్కించిన ‘దిల్లుకు దుడ్డు’ చిత్రం రెండు భాగాలుగా రాంబాలా తెరకెక్కించారు.


GE1l7dQWUAAc4Y8.jpeg

గత యేడాది ‘డిడి రిటర్న్స్‌’ పేరుతో మూడో భాగాన్ని రిలీజ్‌ చేయగా, రాంబాలా వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ప్రేమ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇపుడు ‘డీడీ రిటర్న్స్‌’ మూడో భాగానికి రాంబాలా దర్శకత్వం వహించనున్నారు. హీరో ఆర్య (Arya) ఆ చిత్రానికి నిర్మాత. ఇందులో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె విజయ్‌ సరసన ‘ది గోట్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

meenakshi1.jpg

Updated Date - Jun 23 , 2024 | 10:11 PM