Tamannaah ,Raashii Khanna: ఫొటోలోనే ఇలా ఉంటే.. ఇక‌ వీడియోలో ఇంకెంతుంటుందో!

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:07 PM

తాజాగా సోషల్ మీడియాలో తమన్నా , రాశీ ఖన్నా ఫొటో బాగా హల్చల్ చేస్తోంది. ఏకంగా దేశం మొత్తంలో ట్రెండ్ అవుతూ నెట్టింట దుమ్ము లేపుతోంది.

Tamannaah ,Raashii Khanna: ఫొటోలోనే ఇలా ఉంటే.. ఇక‌ వీడియోలో ఇంకెంతుంటుందో!
Tamannaah Bhatia Raashii Khanna Aranmanai 4

తాజాగా సోషల్ మీడియాలో తమన్నా (Tamannaah Bhatia), రాశీ ఖన్నా (Raashii Khanna) ఫొటో బాగా హల్చల్ చేస్తోంది. ఏకంగా దేశం మొత్తంలో ట్రెండ్ అవుతూ నెట్టింట దుమ్ము లేపుతోంది. అయితే ఈ ఫొటో వారు రీసెంట్ గా నటిస్తోన్న తమిళ చిత్రం ఆరణ్మై 4 (Aranmanai 4) చిత్రంలోది.

raashi.jpeg

హర్రర్ జానర్ లో రూపొందిన ఈ చిత్రాలు ఇప్పటివరకు 3 భాగాలుగా వచ్చి మంచి విజయం దక్కించుకున్నాయి. ఈ చిత్రాలు తెలుగులోనూ చంద్రకళ, కళావతి, అంతపురం గా డబ్ అయి ఇక్కడా హిట్ అయ్యాయి.తమిళంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాల సీక్వెల్స్ కు ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్నది.

thamanah.jpeg

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గానే నాలుగో చిత్రం తెరకెక్కుతోండగా పాత మూడు చిత్రాలను డైరెక్ట్ చేసిన సుందర్ సీ ఈ ఆరణ్మై 4 (Aranmanai 4) చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాల్లో హన్షిక, త్రిష, రాశీ ఖన్నా, ఆండ్రియా, సిద్ధార్థ్, ఆర్య, సుందర్ సీ వంటి టాప్ స్టార్స్ నటించారు.

aran4.jpeg

తాజాగా రూపొందుతున్న చిత్రంలో తమన్నా(Tamannaah Bhatia), రాశీ ఖన్నా (Raashii Khanna), సుందర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై పరిసరాల్లో శరవేగంగా సాగుతోండగా ఈ వేసవిలో ఆరణ్మై 4 (Aranmanai 4) ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ క్రమంలోనే ఈ మధ్య తమన్నా (Tamannaah Bhatia), రాశీ ఖన్నా (Raashii Khanna) పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. ఇప్పుడు ఆ పాట సందర్భంగా తీసిన ఒకటి ,రెండు ఫొటోలు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు.

thamanaha.jpeg

ఇందులో తమన్నా (Tamannaah Bhatia), రాశీ ఖన్నా (Raashii Khanna) ఒకరినిమించి మరొకరు గ్లామర్ ఒలకబోస్తూ స్టిల్స్ ఉండడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

GIm5vYMXEAEW8-r.jpeg

పొటోలోనే ఇలా ఉంటే ఇంక వీడియోలో వీరిద్దరు ఛేసిన హంగామా ఓ రేంజ్ లో ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. దాని కోసం ఈ ఆరణ్మై 4 (Aranmanai 4) చిత్రం విడుదలయ్యేంత వరకు ఎదురుచూడాల్సిందే తప్పదు మరి. అయితే వీరిద్ద‌రు గ‌తంలో తెలుగులో ర‌వితేజ‌తో క‌లిసి బెంగాల్‌టైగ‌ర్ చిత్రంలో ఆడి పాడ‌గా.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఈ సినిమాలో క‌లిసి చేస్తుండ‌డం విశేషం.

Updated Date - Mar 14 , 2024 | 04:12 PM