Tamannaah Bhatia: నా టాలెంటును చూసి.. ఆ పాత్ర ఇచ్చారు

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:13 PM

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు త‌మ‌న్నా భాటియా. 2006లో మంచు మ‌నోజ్ శ్రీ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ పంజాబీ చిన్న‌ది ఆ త‌ర్వాత త‌మిళ‌,హాందీ సినిమాల్లోనూ ప్ర‌వేశించింది. ఇక బాహుబ‌లి సినిమాల‌తో నేష‌న‌ల్‌ వైడ్‌గా రెట్టింపు గుర్తింపు ద‌క్కించుకుంది. తాజాగా ఈ సినిమాలోని అవంతిక పాత్ర‌కు సెల‌క్ట్ కావ‌డంపై కొన్ని విష‌యాల‌ను పంచుకుంది.

Tamannaah Bhatia: నా టాలెంటును చూసి.. ఆ పాత్ర ఇచ్చారు
Tamannaah

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు త‌మ‌న్నా భాటియా (Tamannaah Bhatia). 2006లో మంచు మ‌నోజ్ శ్రీ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ పంజాబీ చిన్న‌ది ఆ త‌ర్వాత త‌మిళ‌,హాందీ సినిమాల్లోనూ ప్ర‌వేశించింది. ఇక 2007లో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం హ్యాపీ డేస్‌ సినిమా భారీ విజ‌యంతో మ‌ళ్లీ వెనుక‌కు వెను తిరిగి చూడాల్సిన అవ‌స‌రం లేకుండా తెలుగులో వ‌రుస ఆఫ‌ర్లు రాబ‌ట్టి ఆగ్ర స్థానానికి చేరింది. ఇదే వ‌రుస‌లో త‌మిళంలోనూ బిజీగా మారింది. 2015,2017లో వ‌చ్చిన బాహుబ‌లి సినిమాల‌తో నేష‌న‌ల్‌ వైడ్‌గా రెట్టింపు గుర్తింపు ద‌క్కించుకుంది.

tamannaahveryhotphotos.jpg

అయితే.. క‌రోనా అనంత‌రం ఈ భామ‌కు కాస్త సినిమా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ఎక్కువ‌గా ప్ర‌త్యేక గీతాల‌లో న‌టిస్తూ వ‌స్తుంది. ఇదే స‌మ‌యంలో దేశంలో ఓటీటీల హ‌వా పెర‌గ‌డంతో ఈ సుంద‌రి అటు వైపు దృష్టి పెట్టడ‌మే గాక‌ గ్లామ‌ర్ డోస్‌ను పెంచి వ‌రుస ఆఫ‌ర్ల‌తో మ‌రోసారి బిజీగా మారింది. బోల్డ్ స‌న్నివేశాలు, ముద్ద సీన్ల‌లోనూ న‌టిస్తూ నేటిత‌రం నాయిక‌ల‌కు తీవ్ర పోటీనిస్తోంది.

Tamannaah Bhatia (3).jpg

ఇదిలాఉండ‌గా.. రాజ‌మౌళి (S. S. Rajamouli ) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి (Baahubali) సినిమా ఓ తెలుగు చిత్రంగా విడుద‌లై ప్ర‌పంచం మొత్తాన్ని మ‌న దేశం వైపు చూసేలా చేసిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇక పార్ట్ 2తో తెలుగు వారి ఘ‌న‌త విశ్వ వ్యాప్తమ‌వ‌డ‌మే గాక మ‌న సినిమాల‌పై ప్ర‌త్యేక దృష్టిని పెట్టేలా కూడా చేసింది. దాని ఫ‌లిత‌మే ఇప్పుడు అన్ని భాష‌ల ఇండ‌స్ట్రీల న‌టులు త‌ప్ప‌కుండా తెలుగు సినిమాల్లో న‌టించాల‌నే కోరిక వెలిబుచ్చ‌డం.


tamannaahbhatia3.jpg

తాజాగా ఓ ప్ర‌వేట్ కార్య‌క‌మంలో పాల్గొన్న త‌మ‌న్నా (Tamannaah Bhatia).. బాహుబ‌లి (Baahubali) చిత్రంలో అవంతిక పాత్రకు రాజ‌మౌళి (S. S. Rajamouli ) న‌న్ను సెలెక్ట్ చేయ‌డానికి వెన‌క‌ కార‌ణంపై గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను తెలిపింది. బాహుబ‌లి సినిమాలో అవంతిక పాత్ర‌కు నేను యాదృశ్చికంగా ఎంపికయ్యానని.. నాకు వ‌చ్చిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని, నా ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాన‌ని పేర్కొన్నారు. ఈ పాత్ర నాకే ఎందుకు ఇచ్చార‌ని నేను చాలాసార్లు రాజ‌మౌళిని గారిని అడిగానని కానీ ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు నాకు జ‌వాబు ఇవ్వ‌లేద‌ని, క‌నిపించిన‌ప్పుడ‌ల్లా న‌వ్వుతూ వెళ్లార‌ని తెలిపింది.

Tamannaah (8).jpg

అయితే ఆ అవంతిక పాత్రను నేను చేస్తున్న‌ప్పుడు.. రాజ‌మౌళి గారు నా టాలెంటును చూసే ఈ పాత్ర ఇచ్చిన‌ట్లు అర్థ‌మైంద‌ని స్ప‌ష్టం చేసింది. ఎవ‌రు ఏ పాత్ర చేయ‌గ‌ల‌రో ఆయ‌న ఇట్టే క‌నిపెడ‌తార‌ని నాకు అంత మంచి పాత్ర‌తో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చేలా చేసినందుకు రాజ‌మౌళి (S. S. Rajamouli ) గారికి ప్ర‌త్యేక కృజ్ఞ‌త‌లు అంటూ త‌న మ‌న‌సులోని మాట‌లు బ‌య‌ట‌పెట్టింది. ఇప్పుడు ఈ విష‌యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక త‌మ‌న్నా ప్ర‌స్తుతం త‌మిళ్‌లో అర‌ణ్మై4, హిందీలో స్రీ 2తో పాటు మ‌రో సినిమా, వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తోంది.

Updated Date - Feb 26 , 2024 | 05:13 PM