Suriya: విదేశాల్లో ఉండటంతో చివరిచూపు దక్కలేదు! 

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:09 PM

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijayakanth) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే! శుక్రవారం సూర్య  (Suriya) ఆయనకు నివాళులర్పించారు. షూటింగ్‌ కారణంగా విదేశాల్లో ఉండటంతో విజయకాంత్‌కు తుది నివాళి అర్పించేందుకు సూర్య రాలేకపోయారు.

Suriya:  విదేశాల్లో ఉండటంతో చివరిచూపు దక్కలేదు! 

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijayakanth) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే! శుక్రవారం సూర్య  (Suriya) ఆయనకు నివాళులర్పించారు. షూటింగ్‌ కారణంగా విదేశాల్లో ఉండటంతో విజయకాంత్‌కు తుది నివాళి అర్పించేందుకు సూర్య రాలేకపోయారు. గురువారం చెన్నైకు చేరుకున్న ఆయన.. విజయకాంత్‌ సమాధి వద్ద అంజలి ఘటించారు. ‘కెప్టెన్‌’ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

‘‘విజయకాంత్‌ నాకు పెద్దన్నతో సమానం. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కెరీర్‌ ఆరంభంలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ నాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ‘పెరియన్నా’ కోసం తొలిసారి విజయకాంత్‌తో కలిసి వర్క్‌ చేశా. సెట్‌లో ఆయనతో కలిసి భోజనం చేశా. డ్యాన్స్‌, ఫైట్‌ బాగా చేయాలంటూ ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన నాలో స్ఫూర్తి నింపారు. అందరితో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు’’ అని సూర్య పేర్కొన్నారు.

ప్రస్తుతం సూర్య కంగువా చిత్రంతో బిజీగా ఉన్నారు. శివ ఈ చిత్రానికి దర్శకుడు. సూర్య పుట్టినరోజున విడుదల చేసిన ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన సంగతి తెలిసిందే! 

Updated Date - Jan 05 , 2024 | 07:09 PM