Suriya: ముంబై మకాం మార్చడంపై సూర్య క్లారిటీ

ABN , Publish Date - Oct 29 , 2024 | 05:54 PM

తమిళ హీరోలు సూర్య, కార్తి వివాదాలకు దూరంగా ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరిపై రూమర్స్‌ కూడా ఏమీ ఉండవు. ఇటీవల సూర్య ముంబైకి మకాం మార్చారు. తన భార్య జ్యోతిక పిల్లలతో అక్కడే ఉంటున్నాడు.

తమిళ హీరోలు సూర్య(Suriya), కార్తి (karthi) వివాదాలకు దూరంగా ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరిపై రూమర్స్‌ కూడా ఏమీ ఉండవు. ఇటీవల సూర్య ముంబైకి మకాం మార్చారు. తన భార్య జ్యోతిక(jyothika) , పిల్లలతో అక్కడే ఉంటున్నాడు. దాంతో సూర్యపై కొత్త గాసిప్పు పుట్టుకొచ్చింది. సూర్యది ఉమ్మడి కుటుంబం. అందరూ కలిసిమెలసి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబంలో తగాదాలు వచ్చాయని, ఆస్తి పంపకాలు జరిగాయని, అందుకే సూర్య ముంబై వెళ్లిపోయాడన్న వార్తలు కొంతరకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై సూర్య క్లారిటీ ఇచ్చాడు. కుటుంబం కోసం  జ్యోతిక ఎన్నో వదులుకుందని ప్రశంసలు కురిపించారు.

‘‘జ్యోతిక 18 ఏళ్ల వయసులో చెన్నైకు వచ్చింది. మా పెళ్లి అయిన తర్వాత అక్కడే ఉన్నాం. ఆమె నా కోసం, నా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ముంబయిలోని తన ేస్నహితులను, కెరీర్‌ను వదులుకుంది. తన జీవనశైలిని మార్చుకుంది. కొవిడ్‌ తర్వాత మార్పు అవసరం అనిపించింది. అందుకే ముంబయి షిఫ్ట్‌ అయ్యాం. ఇప్పుడు ఆమెకు ఎన్నో కొత్త అవకాశాలు వస్తున్నాయి. విభిన్నమైన ప్రాజెక్ట్‌లలో పనిచేస్తోంది. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ సవాళ్లను ఎదుర్కొంటోంది. నేను గొప్ప దర్శకులతో పని చేయాలనుకుంటే. తను మాత్రం ఎప్పుడూ కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి వర్క్‌ చేయాలనుకుంటుంది. ఇటీవల ఆమె నటించిన ‘శ్రీకాంత్‌’, ‘కాదల్‌ - ది కోర్‌’ చిత్రాలు ఎంత చక్కని కథలతో తెరకెక్కాయో తెలిసిందే! మహిళలకు కూడా పని విషయంలో స్వాతంత్య్రం ఉండాలని నేను భావిస్తాను. పురుషుల వలే వారికి కూడా సెలవులు, స్నేహాలు, సరదాలు అవసరం. ఇప్పుడు జ్యోతిక తన కుటుంబంతో, తన స్నేహితులతో స్పెండ్‌ చేస్తోంది. వృత్తిపరంగా బిజీగా ఉంది. నేను ముంబయిలో ఉన్న సమయంలో పూర్తిగా పనిని పక్కన పెట్టేస్తా. నెలలో 10 రోజులు ఫ్యామిలీకే కేటాయిస్తా’’ అని అన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 05:54 PM